మూడో ముప్పు భయాలతోనే ఆన్ లైన్ పాఠాలు..

కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రకటించడానికి, తరగతి గదులు తిరిగి తెరిచేందుకు దాదాపుగా అన్ని రాష్ట్రాలు వెనకాడుతున్న వేళ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కరే కాస్త ధైర్యం చేశారు. లాక్ డౌన్ ఎత్తివేస్తున్న సందర్భంగా జులై 1నుంచి తిరిగి స్కూళ్లు తెరుస్తారని ప్రకటించారు. మొదట్లో అన్ని తరగతులవారిని స్కూళ్లకు రప్పించాbలని అనుకున్నా.. వివిధ వర్గాల ఆందోళన వల్ల కేవలం 9, 10 తరగతుల పిల్లలకు మాత్రమే ప్రత్యక్ష క్లాసులు చెబుతారని, విడతల వారీగా మిగతావారిని స్కూళ్లకు రప్పించాలని నిర్ణయించారు. ఇప్పుడా […]

Advertisement
Update:2021-06-27 02:46 IST

కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రకటించడానికి, తరగతి గదులు తిరిగి తెరిచేందుకు దాదాపుగా అన్ని రాష్ట్రాలు వెనకాడుతున్న వేళ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కరే కాస్త ధైర్యం చేశారు. లాక్ డౌన్ ఎత్తివేస్తున్న సందర్భంగా జులై 1నుంచి తిరిగి స్కూళ్లు తెరుస్తారని ప్రకటించారు. మొదట్లో అన్ని తరగతులవారిని స్కూళ్లకు రప్పించాbలని అనుకున్నా.. వివిధ వర్గాల ఆందోళన వల్ల కేవలం 9, 10 తరగతుల పిల్లలకు మాత్రమే ప్రత్యక్ష క్లాసులు చెబుతారని, విడతల వారీగా మిగతావారిని స్కూళ్లకు రప్పించాలని నిర్ణయించారు. ఇప్పుడా నిర్ణయం కూడా వాయిదా పడింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన, ఉపాధ్యాయ సంఘాల ఆవేదన మధ్య తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుంది. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత, థర్డ్ వేవ్ భయాలు కూడా తొలగిపోయిన తర్వాతే ప్రత్యక్ష తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటి వరకు ఆన్ లైన్ లో విద్యాబోధన చేసేందుకు వీలుగా మార్గదర్శకాలు విడుదల చేయబోతోంది.

పీఆర్టీయూ నేతల సమావేశం..
జులై 1నుంచి తెలంగాణలో క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యాశాఖ ఆమేరకు కసరత్తులు ప్రారంభించిన వేళ, పీఆర్టీయూ నేతలు నేరుగా సీఎం కేసీఆర్ ని కలిశారు. ప్రత్యక్ష తరగతుల్ని కొన్నాళ్లు వాయిదా వేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్ ఆమేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. రోజు మార్చి రోజు 50శాతం మంది ఉపాధ్యాయులు స్కూళ్లకు వచ్చేట్లు, ఆన్ లైన్ బోధనకు తగిన ఏర్పాట్లు చేసుకునేట్టు విద్యాశాఖ మార్గదర్శకాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మూడు నుంచి పదో తరగతి వరకు ఆన్‌ లైన్‌ పాఠాలు బోధిస్తారు. దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా ముందుగా రికార్డు చేసిన పాఠాలను ప్రసారం చేయబోతున్నారు.

ప్రైవేటు పాఠశాలలు డీలా..
జులై-1నుంచి స్కూల్స్ అనగానే ప్రైవేటు పాఠశాలలు ఫీజు క్యాలెండర్ విడుదల చేశాయి. అడ్మిషన్ల వసూళ్లు మొదలు పెట్టాయి. అయితే అంతలోనే ప్రత్యక్ష తరగతులు వద్దు అని ప్రభుత్వం చెప్పేయడంతో యాజమాన్యాలు డీలా పడ్డాయి. ఆన్ లైన్ క్లాసులకు, పూర్తి స్థాయి ఫీజులు కట్టేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలకు ఇబ్బందికర పరిణామమే.

Tags:    
Advertisement

Similar News