పరీక్షలు జరిగేటప్పుడు థర్డ్ వేవ్ విజృంభిస్తే ఏంచేస్తారు..?
టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. పరీక్షలు నిర్వహించే సమయంలో థర్డ్ వేవ్ విజృంభిస్తే ఏం చేస్తారని అడిగింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ప్రాణాపాయం జరిగితే, కుటుంబానికి కోటిరూపాయలు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు చేశారు. పలు రాష్ట్రాలు కూడా పబ్లిక్ పరీక్షలను పక్కనపెట్టేసి ఆల్ పాస్ అంటూ అందర్నీ పాస్ […]
టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. పరీక్షలు నిర్వహించే సమయంలో థర్డ్ వేవ్ విజృంభిస్తే ఏం చేస్తారని అడిగింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ప్రాణాపాయం జరిగితే, కుటుంబానికి కోటిరూపాయలు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు చేశారు. పలు రాష్ట్రాలు కూడా పబ్లిక్ పరీక్షలను పక్కనపెట్టేసి ఆల్ పాస్ అంటూ అందర్నీ పాస్ చేశాయి. ఏపీ, కేరళ మాత్రం పరీక్షలను కేవలం వాయిదా వేశాయి, పరిస్థితులు చక్కబడితే వెంటనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ దశలో సుప్రీంకోర్టు పరీక్షల నిర్వహణపై వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. జులైలో పరీక్షలు నిర్వహిస్తామని, 15రోజుల ముందే టైంటేబుల్ ఇస్తామని, పరీక్ష హాలులో కేవలం 15నుంచి 18మంది విద్యార్థులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఆ అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనిపై పలు ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టు.
– పరీక్షలు నిర్వహించే గదుల వివరాలు అఫిడవిట్ లో ఎందుకు లేవు..?
– కరోనా వేళ ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది కూర్చోవడం ఎలా సాధ్యం?
– ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయి, అది సాధ్యమేనా..?
– 15రోజుల ముందు టైమ్ టేబుల్ ఇస్తే ప్రిపరేషన్ కి సమయం సరిపోతుందా..?
– పరీక్షలు పెడితే సరిపోదు కదా, కరెక్షన్, రిజల్ట్స్.. ఇలా చాలా వ్యవహారాలుంటాయి కదా..?
పరీక్షలపై మరీ మొండిగా ముందుకు పోవద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించిన సుప్రీంకోర్టు, అవసరమైతే సీబీఎస్ఈ, యూజీసీ సలహాలు తీసుకోవాలని చెప్పింది. గ్రేడ్లను మార్కులుగా మార్చడం కష్టమే అయినా, పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుందని చెప్పింది. పూర్తి వివరాలతో రావాలని, రేపు విచారణ చేపడతామని చెప్పింది. జస్టిస్ ఖన్వీల్ కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి తో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.