వ్యాక్సిన్ వికటించి తొలిమరణం.. ధ్రువీకరించిన కేంద్రం..!
కరోనా వ్యాక్సిన్ వికటించి విదేశాల్లో తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాల్లో కొందరికి తీవ్ర అనారోగ్యం వాటిల్లింది. బ్రిటన్లో కొంతమంది వ్యాక్సిన్ తీసుకొని మృతిచెందారు కూడా. అయితే మనదేశంలో మాత్రం ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా రాలేదు. వ్యాక్సిన్ తీసుకున్నాక గుండెపోటుతో కొందరు మృతిచెందినట్టు అక్కడక్కడా వార్తలు వచ్చాయి. కానీ వారు వ్యాక్సిన్ కారణంగా మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకొని […]
కరోనా వ్యాక్సిన్ వికటించి విదేశాల్లో తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాల్లో కొందరికి తీవ్ర అనారోగ్యం వాటిల్లింది. బ్రిటన్లో కొంతమంది వ్యాక్సిన్ తీసుకొని మృతిచెందారు కూడా. అయితే మనదేశంలో మాత్రం ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా రాలేదు. వ్యాక్సిన్ తీసుకున్నాక గుండెపోటుతో కొందరు మృతిచెందినట్టు అక్కడక్కడా వార్తలు వచ్చాయి. కానీ వారు వ్యాక్సిన్ కారణంగా మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించలేదు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకొని చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఓ వృద్ధుడికి (68) వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం తీవ్రమైన సైడ్ఎఫెక్ట్స్ వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ కమిటీ గుర్తించింది. అతడికి అనఫిలాక్సిస్ రావడంతో మృతిచెందినట్టు కమిటీ నిర్ధారించింది.
మనదేశంలో వ్యాక్సిన్ తీసుకొని మరణించిన వ్యక్తిగా కేంద్ర ప్రభుత్వం ఈ వృద్ధుడిని గుర్తించింది. అనఫిలాక్సిస్ అంటే తీవ్రమైన అలర్జీ. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న చాలా మందిలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే చాలా మందికి ఈ లక్షణాలు కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవాళ్లలో పరిస్థితి విషమించే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఎవరికైనా అలర్జీ లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.