హరీష్ రావుకి అదనంగా వైద్యం, ఆరోగ్యం..

ఈటల రాజేందర్ నుంచి వైద్య, ఆరోగ్య శాఖ తీసేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్నింకా ఎవరికీ కట్టబెట్టలేదు. కరోనా కష్టకాలంలో వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహణ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ఆ శాఖను ఎవరికిచ్చినా ముఖ్యమంత్రి పర్యవేక్షణ ఉండాల్సిందే. అందులోనూ ఈటలనుంచి తీసుకున్న శాఖను మరో బీసీకే అప్పగించాలి, లేకపోతే సామాజిక సమతూకం దెబ్బతింటుంది. మంత్రి వర్గ విస్తరణ పెట్టుకుంటే మొదటికే మోసం. అందుకే తెలివిగా హరీష్ రావుకి పరోక్షంగా వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు […]

Advertisement
Update:2021-06-09 01:44 IST

ఈటల రాజేందర్ నుంచి వైద్య, ఆరోగ్య శాఖ తీసేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్నింకా ఎవరికీ కట్టబెట్టలేదు. కరోనా కష్టకాలంలో వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహణ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ఆ శాఖను ఎవరికిచ్చినా ముఖ్యమంత్రి పర్యవేక్షణ ఉండాల్సిందే. అందులోనూ ఈటలనుంచి తీసుకున్న శాఖను మరో బీసీకే అప్పగించాలి, లేకపోతే సామాజిక సమతూకం దెబ్బతింటుంది. మంత్రి వర్గ విస్తరణ పెట్టుకుంటే మొదటికే మోసం. అందుకే తెలివిగా హరీష్ రావుకి పరోక్షంగా వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్.

తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. గతంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో పలు కొత్త ప్రాజెక్ట్ లతో వ్యవసాయ రంగం అభివృద్ధిపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు అదే హరీష్ రావు ఆధ్వర్యంలో రూ.10 వేల కోట్లతో ఆస్పత్రుల అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. రాబోయే రెండేళ్లలో రూ.10,000 కోట్లు ఖర్చు చేసి.. రాష్ట్రంలోని పేదలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్యం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు ఆర్థిక మంత్రి హరీష్ రావు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్.

హరీష్ కీలకంగా మారుతున్నారా…?
తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉద్యోగ సంఘాల నాయకుల్ని కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లారు హరీష్ రావు. కేసీఆర్ తర్వాత ఉద్యమ నాయకుడిగా అంతటి పేరు తెచ్చుకున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరీష్ ప్రాధాన్యం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. రెండో దఫా కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మంత్రి వర్గ విస్తరణపై దృష్టిపెట్టకుండానే కొన్నాళ్లు నియంతృత్వ ధోరణులు ప్రదర్శించారు. కేవలం కొడుకుని మాత్రమే ప్రమోట్ చేసుకున్నారు. ఆ దశలో కేసీఆర్, హరీష్ రావుకి కూడా విభేదాలొచ్చాయని, ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. అయితే అంతలోనే అంతా సర్దుకుంది. తాగాజా ఈటల కూడా పార్టీ మారే క్రమంలో హరీష్ రావు అసంతృప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి ఆయన హాట్ టాపిక్ గా మారారు. అయితే కేసీఆర్ మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలు హరీష్ రావుకే అప్పగించారని సమాచారం. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖపై కూడా ఆయనకే అనధికారిక పర్యవేక్షణ అప్పగించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. హరీష్ రావు మరోసారి టీఆర్ఎస్ లో కీలకంగా మారబోతున్నారని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News