బ్రిడ్జ్ ట్రయల్స్ అక్కర్లేదు.. విదేశీ టీకాలకు భారత్ ఓకే..

విదేశీ టీకాల అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించిన టీకాలకు ప్రత్యేకంగా భారత్ లో బ్రిడ్జ్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేదని డీసీజీఐ ప్రకటించింది. ట్రయల్స్ లేకుండా నేరుగా భారత్ లో ఆయా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్టు తెలిపింది. అయితే తొలుత భారత్ లో 100మందికి ఆయా కంపెనీల టీకాలు ఇచ్చి వారం రోజులపాటు దుష్ఫలితాలు లేకపోతే వెంటనే పంపిణీకి అనుమతిస్తామని పేర్కొంది. ఈ ప్రక్రియ […]

Advertisement
Update:2021-06-03 03:15 IST

విదేశీ టీకాల అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించిన టీకాలకు ప్రత్యేకంగా భారత్ లో బ్రిడ్జ్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేదని డీసీజీఐ ప్రకటించింది. ట్రయల్స్ లేకుండా నేరుగా భారత్ లో ఆయా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్టు తెలిపింది. అయితే తొలుత భారత్ లో 100మందికి ఆయా కంపెనీల టీకాలు ఇచ్చి వారం రోజులపాటు దుష్ఫలితాలు లేకపోతే వెంటనే పంపిణీకి అనుమతిస్తామని పేర్కొంది. ఈ ప్రక్రియ కూడా బ్రిడ్జ్ ట్రయల్స్ లాంటిదే అయినా.. అనుమతులు వేగంగా వచ్చేందుకు అవకాశం ఉంది.

భారత్ లో టీకాల కొరత, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డీసీజీఐ ఈ మేరకు నిబంధనలు సడలించింది. యూరోపియన్ దేశాలతో సహా ఇతర దేశాలన్నీ.. వ్యాక్సిన్ల అనుమతి విషయంలో WHOని అనుసరిస్తున్నాయి. నేరుగా తమ దేశలో పరీక్షలు జరిపి అనుమతి తీసుకున్నా, లేక WHO వద్ద క్లియరెన్స్ తీసుకున్నా.. వ్యాక్సినేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. భారత్ మాత్రం ఇప్పటి వరకూ డీసీజీఐ ఆమోదం తెలిపిన కంపెనీలకే పంపిణీకి అనుమతి ఇచ్చింది. డీసీజీఐ ఆమోదం తెలపాలంటేక సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీ(సీడీఎల్) నిర్వహించే బ్రిడ్జ్ ట్రయల్స్ పాసవ్వాల్సిందే. కొవాక్సిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాలపై ఇలా భారత్ లోనే బ్రిడ్జ్ ట్రయల్స్ చేపట్టి పంపిణీ మొదలు పెట్టారు. అయితే ఇకపై విదేశీ టీకాలకు బ్రిడ్జ్ ట్రయల్స్ లేకుండానే అనుమతిస్తారు. అయితే WHO లేదా, అమెరికా ఎఫ్.డి.ఎ., ఈఎంఏ, యూకే ఎంహెచ్‌ఆర్‌ఏ, జపాన్ పీఎండీఏ.. వీటిలో ఏదో ఒక అనుమతి తప్పనిసరి.

ఇండెమ్నిటీకి కూడా ఓకే..
న్యాయపరమైన చిక్కుల వ్యవహారం ఇండెమ్నిటీకి కి కూడా భారత్ ఓకే చెప్పేసింది. టీకా వేసుకున్న తర్వాత దుష్ప్రభావాలు ఎదురైతే సదరు కంపెనీని ఎవరూ నష్టపరిహారం కోరే అవశం ఉండదు, కోర్టు కేసులు, ఇతర వ్యవహారాలను ఆయా దేశాల ప్రభుత్వాలే ఎదుర్కోవాలనేది ఇండెమ్నిటీ విధానం. ఒక కంపెనీ వ్యాక్సిన్ కి ప్రభుత్వం అనుమతి ఇస్తే, దాని ద్వారా తలెత్తే సమస్యలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించేలా ఇండెమ్నిటీ ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 25దేశాలు ఇలా ఇండెమ్నిటీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఫైజర్, మోడెర్నా సంస్థలు భారత ప్రభుత్వానికి ఇలాంటి అభ్యర్థనలు పెట్టుకున్నాయి. వీటికి అంగీకరించడానికి అభ్యంతరం లేదని తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో భారత్ లో విదేశీ టీకాల పంపిణీకి మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News