యాభై రోజుల్లో లక్షకు పైగా మరణాలు

కోవిడ్ సెకండ్ వేవ్ లో మనదేశం దాదాపు 50 రోజుల్లోనే 1.3 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయింది. మార్చి 2020 నుండి ఇప్పటివరకు దేశంలో జరిగిన కోవిడ్ మరణాల డేటా ఇలా ఉంది. ఏప్రిల్ 1 నుంచి మే 22 మధ్య కాలంలో కోవిడ్ మరణాల సంఖ్య 1.63 లక్షల నుండి 3 లక్షలకు చేరుకుంది. ఇది మొదటి వేవ్ కంటే ఎంతో ఎక్కువ. మొదటి వేవ్ లో భారతదేశం లక్ష మంది ప్రాణాలు కోల్పోయింది. అది […]

Advertisement
Update:2021-05-24 09:54 IST

కోవిడ్ సెకండ్ వేవ్ లో మనదేశం దాదాపు 50 రోజుల్లోనే 1.3 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయింది. మార్చి 2020 నుండి ఇప్పటివరకు దేశంలో జరిగిన కోవిడ్ మరణాల డేటా ఇలా ఉంది.

ఏప్రిల్ 1 నుంచి మే 22 మధ్య కాలంలో కోవిడ్ మరణాల సంఖ్య 1.63 లక్షల నుండి 3 లక్షలకు చేరుకుంది. ఇది మొదటి వేవ్ కంటే ఎంతో ఎక్కువ. మొదటి వేవ్ లో భారతదేశం లక్ష మంది ప్రాణాలు కోల్పోయింది. అది కూడా ఆరున్నర నెలల వ్యవధిలో. మార్చి 12, 2020 నుంచి అక్టోబర్ 2, 2020 వరకూ దేశంలో మరణాల సంఖ్య సుమారు లక్షలోపే ఉందని లెక్కలు చెప్తున్నాయి.

  • దేశంలో రోజువారీ మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ పోతుంది. మార్చి 1 న రోజువారీ మరణాల సంఖ్య 112 ఉండగా, ఏప్రిల్ 1 నాటికి ఇది 349 కి పెరిగింది. 15 రోజుల్లో ఈ సంఖ్య 1,000 కు పెరిగింది. మే 1 నాటికి 3,000 అలాగే మే 21 నాటికి 4,188 గా ఉంది. మొత్తంగా గడిచిన 50 రోజుల్లోనే కోవిడ్ సెకండ్ వేవ్ 1.3 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ సెకండ్ వేవ్ ఒక్కోదేశంలో ఒక్కోవిధంగా ఉంది.

కోవిడ్ రెండు వేవ్స్ ను ఎదుర్కొన్న అమెరికా ఇప్పటివరకు 5.8 లక్షల మరణాలను నమోదు చేసింది. 2020 డిసెంబర్ 1 నాటికి 2.7 లక్షలు ఉన్న మరణాల సంఖ్య 2021 జనవరి 8 నాటికి 3.7 లక్షలకు పెరిగింది. అంటే కేవలం- ఐదు వారాల్లోనే లక్ష మరణాలను చూసింది. ఇలా ప్రపంచంలో చాలా దేశాల్లో సెకండ్ వేవ్ తీవ్రంగా మరణ విషాదాన్ని మిగిల్చింది.

Tags:    
Advertisement

Similar News