తెలుగు రాష్ట్రాల్లో భారీ తుపాన్ హెచ్చరికలు

గత కొంతకాలంలో వాతావరణంలో మార్పులు గమనిస్తూనే ఉన్నాం. సాయంత్రానికి రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు మరో అతి పెద్ద తుపాన్ రాబోతుంది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో మే 22 శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావం మన తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉండబోతోంది. ఈ తుపాన్ మే 25 నాటికి పెద్ద తుపాన్ గా మారవచ్చని ఇండియన్ మెటరాజికల్ డిపార్ట్ మెంట్ […]

Advertisement
Update:2021-05-23 08:59 IST

గత కొంతకాలంలో వాతావరణంలో మార్పులు గమనిస్తూనే ఉన్నాం. సాయంత్రానికి రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు మరో అతి పెద్ద తుపాన్ రాబోతుంది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో మే 22 శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావం మన తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉండబోతోంది.

ఈ తుపాన్ మే 25 నాటికి పెద్ద తుపాన్ గా మారవచ్చని ఇండియన్ మెటరాజికల్ డిపార్ట్ మెంట్ సూచించింది. దీన్ని యాస్ తుపాన్ గా పిలుస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, ఏపీ, పశ్చిమబెంగాల్, అండమాన్, తమిళనాడు రాష్టాల్లో భారీ వర్షాలు, వరదలు తలెత్తే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. దీని ద్వారా నీళ్లు, దోమలు, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు మరింతగా పెరిగే ప్రమాదం కూడా ఉందని సూచించింది. ఈ తుపాన్ ప్రభావంగా ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

Tags:    
Advertisement

Similar News