కాంగ్రెస్ మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్, ఆయన కుమారుడు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.;
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ తనిఖీలు చేశామని ఈడీ అధికారులు పేర్కొన్నారు. 15 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. భిలాయి ప్రాంతంలో ఉన్న చైతన్య భగేల్ నివాసం కూడా ఉంది. ఈ తనిఖీల నేపథ్యంలో భగేల్ కార్యాలయం నుంచి స్పందన వచ్చింది. ‘‘ఏడు సంవత్సరాలు నడిచిన తప్పుడు కేసును కోర్టు కొట్టివేసిందని.
కానీ ఇప్పుడు ఈడీ అతిథులు వచ్చి భగేల్ ఇంటిలో సోదాలు నిర్వహించడం ఏంటని కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఆదాయన్నికి భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ సిండికేట్‌కు రూ.రెండువేల కోట్ల మేర లబ్ధి చేకూరిందని ఈడీ గతంలో పేర్కొంది. దర్యాప్తులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు వ్యాపారవేత్తలను అరెస్టు చేసింది. ఈడీ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుదారులు మాజీ సీఎం ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో వచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రత కోసం హాజరైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా సిబ్బంది కవరేజీని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి.