కోలుకున్నాక ఇలా..
కరోనా రాకుండా చూసుకోవడం ఒక ఎత్తైతే.. వచ్చి పోయిన తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే.. కరోనా ఒంట్లో ఉన్నన్ని రోజులు శరీరంలో రకరకాల కణజాలాల్ని నాశనం చేసి ఎంతో కొంత డ్యామేజ్ చేసి వెళ్లిపోతుంది. అందుకే కరోనా నుంచి కోలుకున్న తర్వాత తగినన్ని జాగ్రత్తలు తీసుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కరోనా వచ్చి పోయిన తర్వాత ‘ ఇక మనకు రాదులే’ అన్న ధోరణితో.. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగెటివ్ రిపోర్ట్ రాగానే […]
కరోనా రాకుండా చూసుకోవడం ఒక ఎత్తైతే.. వచ్చి పోయిన తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే.. కరోనా ఒంట్లో ఉన్నన్ని రోజులు శరీరంలో రకరకాల కణజాలాల్ని నాశనం చేసి ఎంతో కొంత డ్యామేజ్ చేసి వెళ్లిపోతుంది. అందుకే కరోనా నుంచి కోలుకున్న తర్వాత తగినన్ని జాగ్రత్తలు తీసుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
కరోనా వచ్చి పోయిన తర్వాత ‘ ఇక మనకు రాదులే’ అన్న ధోరణితో.. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగెటివ్ రిపోర్ట్ రాగానే ఆరోగ్యంపై శ్రద్ధ వదిలేస్తున్నారు. కానీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆహారం, వ్యాయామంపై కేర్ తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.
నెగెటివ్ వచ్చిన తర్వాత కనీసం వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ ఉండాలి.
కొవిడ్ ప్రభావం అన్నింటికన్నా ఎక్కువగా ఊపిరితిత్తులపైనే ఉంటుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెగెటివ్ వచ్చిన వారం వరకూ.. కార్డియో ఎక్సర్ సైజులకు దూరంగా ఉండడం మంచిది. దానికి బదులు యోగా, ప్రాణాయామం చేయడం కొంతవరకూ బెటర్.
నెగెటివ్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకూ బ్యాలెన్స్ డ్ డైట్ తీసుకోవాలి ఆహారంలో కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, తగిన పాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువగా తింటుండాలి. తీపి పదార్థాలను కూడా తగ్గించడం బెటర్.