కరోనాకు కొత్త ఔషధం.. నీళ్లలో కలుపుకొని తాగేయడమే..
కరోనాకు కొత్త ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు డీఆర్డోఓ తెలిపింది. 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) పేరుతో దీన్ని పిలుస్తున్నారు. దీని అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కూడా అనుమతి ఇచ్చింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారిపై కూడా ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైంది. కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి ఇది బాగా పనిచేస్తోందని, కృత్రిమ ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తోందని డీఆర్డీఓ తెలిపింది. డీఆర్డీఓ కు చెందిన ఢిల్లీలోని […]
కరోనాకు కొత్త ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు డీఆర్డోఓ తెలిపింది. 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) పేరుతో దీన్ని పిలుస్తున్నారు. దీని అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కూడా అనుమతి ఇచ్చింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారిపై కూడా ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైంది. కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి ఇది బాగా పనిచేస్తోందని, కృత్రిమ ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తోందని డీఆర్డీఓ తెలిపింది. డీఆర్డీఓ కు చెందిన ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ సంస్థ శాస్త్రవేత్తలు ఏప్రిల్ 2020లో దీనిపై పరిశోధనలు ప్రారంభించారు. 2డీజీ ఔషధం పనితీరును హైదరాబాద్ లోని సీసీఎంబీతో కలిసి ల్యాబ్‌లో పరిశీలించారు. ఇది కరోనా వైరస్ వృద్ధిని నిరోధిస్తున్నట్లు పరీక్షల్లో రుజువైంది.
క్యాన్సర్ నివారణ కోసం తయారీ..
2 డీజీ ఔషధాన్ని గతంలో క్యాన్సర్ నివారణకోసం తయారు చేసేవారు. క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా చేయడం ఈ మందు చేసే పని. తద్వారా క్యాన్సర్ కణాల వృద్ధిని ఇది సమర్థంగా అడ్డుకుంటుంది. కొవిడ్ వైరస్ ని సైతం ఇలాగే అడ్డుకునేందుకు ఏడాది క్రితం డీఆర్డీఓ శాస్త్రవేత్తలు దీనిపై ప్రయోగాలు మొదలు పెట్టారు. కొవిడ్ వైరస్ బాధితుల శరీరంలోకి ప్రవేశించిన వెంటనే ఇది కణజాలాలకు అతుక్కుపోతుంది. కణంలోని శక్తిని, గ్లూకోజ్ ను ఉపయోగించుకుని వైరస్ కొన్నివేల రెట్లు పెరుగుతుంది. అదే గ్లూకోజ్ అందుబాటులో లేకపోతే కణ విభజన జరగదు, వైరస్ త్వరగా పెరగదు. 2డీజీ ఔషధం ద్వారా కరోనా వైరస్ ని వేగంగా వృద్ధి చెందకుండా చేయొచ్చని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు నిరూపించారు. పది రోజుల్లో కోలుకునేవారు ఏడు రోజుల్లోనే కోలుకుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎలా తీసుకోవాలి..?
ఇప్పటి వరకూ కరోనా చికిత్సలో వాడుతున్న ఔషధాలు, ఇంజెక్షన్ల రూపంలో, ట్యాబ్లెట్ల రూపంలో ఉంటున్నాయి. కొత్తగా తయారు చేసిన 2డీజీ ఔషధం పౌడర్ రూపంలో ఉంటుంది. దీన్ని నీళ్లలో కలుపుకొని తాగితే నేరుగా వైరస్ సోకిన కణాల్లోకి ప్రవేశించి, వాటి వృద్ధిని అడ్డుకుంటుందని చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ లో దీని సమర్థత బాగున్నట్టు చెబుతున్నారు డీఆర్డీఓ శాస్త్రవేత్తలు. 2డీజీ ఔషధం శరీరంలోకి వెళ్లి వైరస్ కణాలపై సత్వరం పనిచేస్తుండటం వల్ల కృత్రిమ ఆక్సిజన్ అవసరం తగ్గుతుందని, ప్రాణాపాయ స్థితి తప్పుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
2 డీజీ ఔషధాన్ని రోగులపై ప్రయోగించేందుకు డీసీజీఐ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సి.డి.ఎస్.సి.ఒ.) రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కు మే 2020లో అనుమతి ఇచ్చాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌తో కలిసి మే – అక్టోబరు 2020 మధ్యలో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. అందులో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించక పోవడంతో దేశవ్యాప్తంగా రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. సమర్థంగా పనిచేస్తున్నట్లు ఫలితాలు రావడంతో సమగ్ర నివేదికలను డీసీజీఐకి సమర్పించగా అత్యవసర వినియోగానికి మే-1న అనుమతి ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి సాధ్యమైనంత త్వరగా దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు డీఆర్డీఓ ప్రయత్నిస్తోంది. ఈ ఔషధానికి పేటెంట్ కూడా పొందినట్లు డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి వెల్లడించారు. దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డీఆర్డీఓ తనవంతు పాత్ర పోషిస్తోందని తెలిపారాయన.