మోదీ సూపర్ స్ప్రెడర్.. ఎందుకంటే..
భారతీయ వైద్య సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ నవ్‌జోత్ దహియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కరోనా వైరస్ యొక్క “సూపర్ స్ప్రెడర్” అని పిలిచారు. మోదీ వల్లనే కరోనా ఇంతగా వ్యాపించిందని విమర్శిస్తున్నారు. ఇంతకీ రీజన్ ఏంటంటే.. ‘కోవిడ్ -19 నిబంధనలను ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి వైద్యులంతా తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, పెద్ద పెద్ద రాజకీయ ర్యాలీలు నిర్వహించడానికి మోదీ వెనుకాడలేదు, కోవిడ్ -19 నిబంధనలను గాలిలోకి విసిరేశారు’ అని దహియా ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ లో […]
భారతీయ వైద్య సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ నవ్‌జోత్ దహియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కరోనా వైరస్ యొక్క “సూపర్ స్ప్రెడర్” అని పిలిచారు. మోదీ వల్లనే కరోనా ఇంతగా వ్యాపించిందని విమర్శిస్తున్నారు. ఇంతకీ రీజన్ ఏంటంటే..
‘కోవిడ్ -19 నిబంధనలను ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి వైద్యులంతా తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, పెద్ద పెద్ద రాజకీయ ర్యాలీలు నిర్వహించడానికి మోదీ వెనుకాడలేదు, కోవిడ్ -19 నిబంధనలను గాలిలోకి విసిరేశారు’ అని దహియా ఒక ప్రకటనలో తెలిపారు.
భారత్ లో కరోనా మొదటి కేసుని 2020లో కనుగొన్నప్పుడు.. దాని వ్యాప్తికి అడ్డుకట్ట వేయకుండా.. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను స్వాగతించడానికి గుజరాత్‌లో లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేశారని దహియా గుర్తు చేశారు.
‘ఇప్పుడు, కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోక పోగా.. కుంభమేళాలు, ఎలక్షన్ ర్యాలీలు వంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ.. వైరస్ స్ప్రెడర్ గా మారారు' అని విమర్శించారు. దీంతో పాటు ఆక్సిజన్ కొరత వేధిస్తుండగా.. ఆక్సిజన్ ప్లాంట్లను స్థాపించడం కోసం అనేక ప్రాజెక్టులకు ఇంకా క్లియరెన్స్ కూడా ఇవ్వట్లేదని ఆయన అన్నారు.
‘వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనపై కూడా మోదీ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. వారి సమస్యలను పరిష్కరించకుండా రైతుల భారీ ప్రొటెస్ట్ కు అనుమతించారు” అని దహియా అన్నారు.
భారతదేశంలో ఇప్పుడు సగటున ఒక్క రోజుకి రెండు మూడు లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. రెండు మూడు వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఉత్తరాఖండ్ హరిద్వార్ నగరంలోని కుంభమేళాలో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అలాగే ఎన్నికల ర్యాలీలకు వేల మంది హాజరవుతున్నారు. దీని వల్లనే వైరస్ వ్యాప్తి ఇంతగా పెరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో నాల్గవ విడత ఎన్నికల తరువాత, మిగిలిన దశలకు పెద్ద ఎన్నికల ర్యాలీలు నిర్వహించబోమని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్‌లో తన ర్యాలీలను రద్దు చేసుకున్నారు. మమతా బెనర్జీ కూడా తక్కువ మందితో ఎన్నికల సమావేశాలు నిర్వహించారు. ఇలాంటి సందర్భంలో.. కరోనావైరస్ కేసుల పెరుగుదలను ఎన్నికలతో లింక్ చేయడం సరికాదని అమిత్ షా అన్నారు.
భారతదేశంలో కరోనా మహమ్మారిపై అంతర్జాతీయ మీడియా కూడా కోడైకూసింది. మోదీని తప్పు బట్టింది. ఈ వైరస్ వ్యాప్తి.. పూర్తిగా మోదీ వైఫల్యం అని అంటోంది.