సచ్చినోళ్ల గురించి చర్చ అనవసరం.. కోవిడ్ మరణాలపై సీఎం వ్యాఖ్యలు
మన దేశంలో కోవిడ్ ఎటువంటి ఉత్పాతాన్ని సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ కొందరు రాజకీయ నాయకులు ఎంతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని పలు చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. నేతలు యథేచ్ఛగా ర్యాలీలు, రోడ్‌షోలు జరుపుకొంటున్నారు. చాలా మంది ప్రజలకు మాస్కులే ఉండటం లేదు. కరోనా వ్యాప్తికి ఇటువంటి రోడ్‌షోలు పరోక్షంగా కారణం అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు నేతలు ఎంతో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. తాజాగా హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఆ జాబితాలో చేరిపోయారు. […]
మన దేశంలో కోవిడ్ ఎటువంటి ఉత్పాతాన్ని సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ కొందరు రాజకీయ నాయకులు ఎంతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని పలు చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. నేతలు యథేచ్ఛగా ర్యాలీలు, రోడ్‌షోలు జరుపుకొంటున్నారు. చాలా మంది ప్రజలకు మాస్కులే ఉండటం లేదు. కరోనా వ్యాప్తికి ఇటువంటి రోడ్‌షోలు పరోక్షంగా కారణం అవుతున్నాయి.
ఇదిలా ఉంటే కొందరు నేతలు ఎంతో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. తాజాగా హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఆ జాబితాలో చేరిపోయారు. ‘ కరోనా తో రోజుకు ఇన్ని వేల మంది చనిపోతున్నారు అని చాలా మంది చర్చించుకుంటున్నారు. దాని వల్ల ఉపయోగం ఏమిటి? చనిపోయిన వాళ్లు ఎలాగూ పోయారు? కనీసం ప్రస్తుతం బతికి ఉన్నవాళ్లనైనా కాపాడుకుందాం’ అంటూ మనోహర్ లాల్ వ్యాఖ్యానించారు అయితే సీఎం వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఆయనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
బాధ్యత యుతమైన పదవిలో ఉన్న మనోహర్‌లాల్ ఖట్టర్ .. ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని వాళ్లు విమర్శిస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సైతం మండిపడ్డారు. ఆయనకు అసలు జాలీ, మానవత్వం లేకుండా పోయాయని విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు సీఎం పదవికి అనర్హులంటూ మండిపడ్డారు.
మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తున్న విషయం తెలిసిందే. కేవలం సకాలంలో ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శ్మశానాల వద్ద క్యూలైన్లు కడుతున్నారు. ఇటువంటి సమయాల్లో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడటం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు చాలా చోట్ల రాజకీయనేతలే కరోనాను పెంచిపోషిస్తున్నారు. ఇష్టారాజ్యంగా రోడ్‌షోలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు కూడా వస్తున్నాయి.