అనర్హుల ఏరివేత..! పారదర్శకతకు పెద్దపీట
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే పలువురు అనర్హులు కూడా సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో అర్హులకు పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు అందకుండా అనర్హులు వాటిని పొందతున్నారు. ఈ విషయం గ్రహించిన ప్రభుత్వం సంక్షేమ పథకాలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగా అనర్హులను జాబితా నుంచి ఏరివేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా పింఛన్ల విషయంపై […]
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే పలువురు అనర్హులు కూడా సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో అర్హులకు పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు అందకుండా అనర్హులు వాటిని పొందతున్నారు. ఈ విషయం గ్రహించిన ప్రభుత్వం సంక్షేమ పథకాలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని యోచిస్తున్నది.
ఇందులో భాగంగా అనర్హులను జాబితా నుంచి ఏరివేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా పింఛన్ల విషయంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. తప్పుడు పత్రాలు సమర్పించి పింఛన్లు పొందినవారిని జాబితా నుంచి తొలగించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్‌ఆర్ పింఛను కానుకలో భాగంగా కులవృత్తులు, మెడికల్ విభాగాల అర్హుల్ని గుర్తించేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కులవృత్తుల ఆధారంగా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు కచ్చితంగా కులవృత్తి మాత్రమే జీవనాధారంగా చేసుకోవాలని కొత్త ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది. కులవృత్తులకు సంబంధించిన పత్రాలను ఇప్పటి నుంచి ఎక్సైజ్, సాంఘిక సంక్షేమ శాఖ, చేనేత, జౌళిశాఖ, మత్స్యశాఖ, వైద్యశాఖలు జారీ చేయనున్నాయి.
వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులను గుర్తించనున్నారు. పింఛన్ పొందుతున్న వ్యక్తులు నిజంగానే కులవృత్తిని నమ్ముకొని ఉన్నారా? లేక ఇతర పనులు కూడా చేస్తున్నారా? అన్న విషయాన్ని వాళ్లు విచారించనున్నారు.
లబ్ధిదారుల వృత్తికి జియోట్యాగింగ్ చేసి వారి లాగిన్లు ద్వారా తిరిగి శాఖాధికారుల పరిశీలనకు పంపించాలి. ఈ ప్రక్రియను 21 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఏపీలో 61.28 లక్షల మంది వివిధ సంక్షేమపథకాల కింద లబ్ధి పొందుతున్నారు.