అర్థం చేసుకోండి.. తలైవా క్షేమంగా ఉండటమే కదా కావాల్సింది.. లారెన్స్​ లేఖ..!

రజినీకాంత్​ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం.. మళ్లీ కొంతకాలం సైలంట్​గా ఉండటం.. మళ్లీ వస్తానని చెప్పడం.. అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానని ఫైనల్​గా ఓ క్లారిటీ ఇవ్వడం. రజినీ పొలిటికల్​ ఎంట్రీపై సాగిన పరిణామక్రమం ఇది. ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లొద్దని అటు డాక్టర్లు, ఇటు కుటుంబసభ్యులు చెప్పారు. అయితే ఆయన ఆ విషయాన్ని ముందే ప్రకటించిఉంటే సరిపోయేది. కానీ అభిమానులను తమిళప్రజలను కొంత గందరగోళానికి గురిచేసి ఆ తర్వాత ప్రకటించడం […]

Advertisement
Update:2021-01-12 17:32 IST

రజినీకాంత్​ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం.. మళ్లీ కొంతకాలం సైలంట్​గా ఉండటం.. మళ్లీ వస్తానని చెప్పడం.. అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానని ఫైనల్​గా ఓ క్లారిటీ ఇవ్వడం. రజినీ పొలిటికల్​ ఎంట్రీపై సాగిన పరిణామక్రమం ఇది. ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లొద్దని అటు డాక్టర్లు, ఇటు కుటుంబసభ్యులు చెప్పారు. అయితే ఆయన ఆ విషయాన్ని ముందే ప్రకటించిఉంటే సరిపోయేది.

కానీ అభిమానులను తమిళప్రజలను కొంత గందరగోళానికి గురిచేసి ఆ తర్వాత ప్రకటించడం కాస్త విస్మయానికి గురిచేసింది. కానీ మక్కల్​ మండ్రమ్​ నేతలు మాత్రం ప్రస్తుతం నైరాశ్యంలో ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని వాళ్లు చాలా ఆశలుపెట్టుకున్నారు. కానీ ఇప్పుడా ఆశలన్నీ అడియాసలు కావడంతో రజినీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేపోతున్నారు.

రజినీ కాంత్​ రాజకీయాల్లోకి రావాలంటూ ఇప్పటికీ వాళ్లు ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రజినీకాంత్​ వీరాభిమాని, తమిళనటుడు, డ్యాన్సర్​, దర్శకుడు రాఘవ లారెన్స్​ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఇప్పుడీ ప్రకటన సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

ఆ ప్రకటనలో ఏముందంటే.. ‘ తలైవా రాజకీయాల్లోకి రావాలని నేను కూడా కోరుకున్నాను. ఆయన నిర్ణయంతో నేను కూడా మీకంటే ఎక్కువగా బాధపడుతున్నాను. అయితే వల్లువర్ కూట్టమ్‌ లో మీరు చేస్తున్న నిరసనకు నా మద్దతు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఇందుకోసం
డైరెక్టర్ సాయి రమణి ద్వారా ఎన్నో వాయిస్ మెసేజులు పంపారు. అయితే ప్రస్తుతం నేను మీ నిరసనకు మద్దతు ఇవ్వలేను.

ఎందుకంటే రజినీకాంత్​.. అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వేరే కారణంతో కాదు. ఇతర కారణాలతో ఆయన రాజకీయాలకు దూరం అయిఉంటే మీతో పాటు నేను కూడా ఆందోళన చేసేవాడిని. అయితే ఇప్పుడు మనకు రజినీకాంత్​ ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఆయన డాక్టర్ల మాటను పెడచెవిన పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే.. ఏదైనా జరగరానిది జరిగితే మనమంతా ఇప్పటికంటే ఎక్కువగా బాధపడతాం. కాబట్టి ఇప్పుడు మనమంతా సంయమనంతో ఉందాం’ అంటూ లారెన్స్​ పోస్ట్​చేశాడు.

Tags:    
Advertisement

Similar News