గుజరాత్​ మాజీ సీఎం కన్నుమూత.. ప్రధాని, కాంగ్రెస్​ అధినేత్రి నివాళి

కేంద్రమాజీ మంత్రి, గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్​ కాంగ్రెస్​ నేత మాధవ్ సిన్హా సోలంకి(93) తుదిశ్వాస విడిచారు. శనివారం తెల్లవారుజామున గాంధీనగర్​లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. మాధవ్​ సిన్హా చాలా కాలం పాటు గుజరాత్​ సీఎంగా పనిచేశారు. నరేంద్రమోదీ తర్వాత గుజరాత్​కు అత్యధిక కాలం సీఎంగా పనిచేశారు సోలంకి. కొంతకాలంపాటు విదేశాంగశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. మాధవ్ సిన్హా మృతికి కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మోదీ నివాళి అర్పించారు. […]

Advertisement
Update:2021-01-09 10:20 IST

కేంద్రమాజీ మంత్రి, గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్​ కాంగ్రెస్​ నేత మాధవ్ సిన్హా సోలంకి(93) తుదిశ్వాస విడిచారు. శనివారం తెల్లవారుజామున గాంధీనగర్​లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. మాధవ్​ సిన్హా చాలా కాలం పాటు గుజరాత్​ సీఎంగా పనిచేశారు. నరేంద్రమోదీ తర్వాత గుజరాత్​కు అత్యధిక కాలం సీఎంగా పనిచేశారు సోలంకి.

కొంతకాలంపాటు విదేశాంగశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. మాధవ్ సిన్హా మృతికి కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మోదీ నివాళి అర్పించారు. దేశం ఓ నిస్వార్థ నేతను కోల్పోయిందని సోనియాగాంధీ నివాళి అర్పించారు. నేటి యువతకు, రాజకీయాల్లోకి రావాలనుకొనేవాళ్లకు మాధవ్​ సిన్హా ఆదర్శంగా నిలుస్తారని ఆమె పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. మాధవ్​ సిన్హా గొప్ప సేవకుడిగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. ఆయనకు రాజకీయాలతోపాటు పుస్తకపఠనం పట్ల కూడా ఎంతో ఆసక్తి ఉండేదని చెప్పారు. ఆయనను కలిసిన ప్రతి సారి తాను చదివిన పుస్తకం గురించే ఆయన చెప్పేవారేన్నారు. ఆయన తనకు గొప్ప స్నేహశీలి అని అభిర్ణించారు.

మరోవైపు ఆయనతో జరిగిన సంభాషణలను తాను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటానన్నారు. ప్రజాశ్రేయస్సు పట్ల ఆయన చూపిన నిబద్ధత రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మాధవ్​ మృతి దేశానికి తీరని లోటని వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News