ప్రతిపక్షాల సహనాన్ని పరీక్షిస్తోన్న జగన్..

మూడు రాజధానుల విషయంలో టీడీపీ రగిలిపోతోంది. అమరావతిని ఓ బంగారుబాతుగా భావించి లాభాలు పిండుకోవాలని చూసిన చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. అయినా సరే ఎలాగైనా మూడు రాజధానుల్ని అడ్డుకుంటానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు చంద్రబాబు. న్యాయపోరాటం చేస్తామంటూ సరికొత్త ఎత్తుగడ వేశారు. ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారు. సీఎం జగన్ ఇప్పటి వరకూ గవర్నర్ నిర్ణయంపై కనీసం స్పందించలేదు. దీంతో చంద్రబాబు మరింతగా రగిలిపోతున్నారు. అమరావతి ఉద్యమం అంటూ రైతుల్ని రెచ్చగొట్టి […]

Advertisement
Update:2020-08-03 05:16 IST

మూడు రాజధానుల విషయంలో టీడీపీ రగిలిపోతోంది. అమరావతిని ఓ బంగారుబాతుగా భావించి లాభాలు పిండుకోవాలని చూసిన చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. అయినా సరే ఎలాగైనా మూడు రాజధానుల్ని అడ్డుకుంటానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు చంద్రబాబు. న్యాయపోరాటం చేస్తామంటూ సరికొత్త ఎత్తుగడ వేశారు. ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారు.

సీఎం జగన్ ఇప్పటి వరకూ గవర్నర్ నిర్ణయంపై కనీసం స్పందించలేదు. దీంతో చంద్రబాబు మరింతగా రగిలిపోతున్నారు. అమరావతి ఉద్యమం అంటూ రైతుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. తన అనుకూల మీడియా ద్వారా ఆ వార్తల్ని హైలైట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. అయినా కూడా జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోజులు గడుస్తున్నా మౌనాన్నే ఆశ్రయిస్తూ ప్రతిపక్షాల సహనాన్ని మరింతగా పరీక్షిస్తున్నారు జగన్.

అటు బీజేపీ, జనసేన అమరావతిపై ఎటూ తేల్చుకోలేక సతమతం అవుతున్నాయి. రాజధానిపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూనే.. అమరావతి రైతులకు నష్టం జరక్కూడదనే వింత వాదన తెరపైకి తెచ్చాయి బీజేపీ, జనసేన. టీడీపీ, వైసీపీ.. రెండు పార్టీలను దోషులుగా చిత్రీకరించడానికి తాపత్రయ పడుతున్నాయి.

జగన్ మౌనం ఆ రెండు పార్టీలను కూడా ఇబ్బంది పెడుతోందనేమాట వాస్తవం. జగన్ కనీసం మాట్లాడితే.. అమరావతి రైతులకు ఆయన వ్యతిరేకం అని చిత్రీకరించడానికి ప్రతిపక్షాలకు ఓ అవకాశం దొరుకుతుంది. మాటకు మాట పెరిగితే.. మధ్యలో కేంద్రాన్ని పంచాయితికీ పిలవొచ్చనే దురాలోచన కూడా బాబుకి ఉంది.

అయితే ఆయన నోరు తెరవడంలేదే? నిమ్మగడ్డ వ్యవహారంలో తన ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడూ ఆయన మౌనంగానే ఉన్నారు, ఆ వెంటనే తన నిర్ణయానికి గవర్నర్ ఆమోద ముద్ర వేసినప్పుడూ ఆయన గుంభనంగానే ఉన్నారు. ఇప్పుడీ సైలెన్సే ప్రతిపక్షాల పాలిట వయలెన్స్ గా మారింది. ఇంకెన్నాళ్లు జగన్ ప్రతిపక్షాల సహనాన్ని పరీక్షిస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News