రాయలసీమ ఎత్తిపోతలకు నేడు టెండర్ల నోటిఫికేషన్

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కరువు నుంచి కాపాడేందుకు తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నేడు టెండర్ నోటిఫికేషన్ జారీ కానుంది. ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన ప్రతిపాదనలతో టెండర్లు ఆహ్వానిస్తున్నారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ 30నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. 15 ఏళ్ల పాటు ఎత్తిపోతల పథకం నిర్వాహణ కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనుల విలువను 3వేల 278 […]

Advertisement
Update:2020-07-20 11:54 IST

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కరువు నుంచి కాపాడేందుకు తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నేడు టెండర్ నోటిఫికేషన్ జారీ కానుంది. ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన ప్రతిపాదనలతో టెండర్లు ఆహ్వానిస్తున్నారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ 30నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. 15 ఏళ్ల పాటు ఎత్తిపోతల పథకం నిర్వాహణ కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనుల విలువను 3వేల 278 కోట్లుగా నిర్ణయించారు.

నేడు ఉదయం 11 గంటలకు టెండర్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆగస్టు 3వ తేది వరకు టెండర్లు దాఖలు చేయవచ్చు. ప్రీ బిడ్‌ సమావేశం ఈనెల 27న నిర్వహిస్తారు. కాట్రాక్టర్లకు ఉన్న సందేహాలను అధికారులు నివృత్తి చేస్తారు. ఆగస్ట్ 4న సాంకేతిక బిడ్, ఏడున ఫైనాన్షియల్ బిడ్ తెరుస్తారు. ఆ తర్వాత ఎల్‌ 1 ధరను కాంట్రాక్ట్ ధరగా నిర్ణయించి రివర్స్ టెండరింగ్‌ నిర్వహిస్తారు. 30నెలల్లోనే ఈ ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల వద్ద నీరు ఉన్నా రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయవచ్చు.

Tags:    
Advertisement

Similar News