జేజే ఆస్పత్రికి వరవరరావు తరలింపు
విరసం నేత, కవి వరవరరావును ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను జైలు సిబ్బంది ముంబైలోని జేజే ఆస్పత్రిలో చేర్చారు. ఒక కేసులో వరవరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. వయసు మీద పడడం, ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో వరవరరావు జైలులో ఇబ్బందిపడుతున్నారు. జేజే ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఆయన్ను జైలుకు తరలిస్తారేమోనన్న అనుమానాన్ని కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావుకు బెయిల్ ఇవ్వాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. కేంద్ర […]
విరసం నేత, కవి వరవరరావును ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను జైలు సిబ్బంది ముంబైలోని జేజే ఆస్పత్రిలో చేర్చారు. ఒక కేసులో వరవరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. వయసు మీద పడడం, ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో వరవరరావు జైలులో ఇబ్బందిపడుతున్నారు.
జేజే ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఆయన్ను జైలుకు తరలిస్తారేమోనన్న అనుమానాన్ని కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావుకు బెయిల్ ఇవ్వాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసుల్లో వరవరరావును ఇరికించిందని ఆరోపిస్తున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు బెయిల్ ఇవ్వాల్సిందిగా బాంబే హైకోర్టులో ఆయన తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. కరోనా పరిస్థితులు, నానాటికి క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వరవరరావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వరవరరావు మెడికల్ రికార్డులను సమర్పించేలా తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్ కూడా బాంబే హైకోర్టులో దాఖలైంది.