కోర్టుల ద్వారా పాలన చేస్తే... ఇక ఎన్నికలెందుకు? ప్రజాప్రతినిధులెందుకు?

పరిపాలనలో కోర్టులు నేరుగా జోక్యం చేసుకుంటున్నాయని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా కోర్టు ద్వారా ప్రభుత్వాలను నడిపిస్తారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రతి వ్యవస్థకు బాధ్యతలతో పాటు హద్దులు కూడా నిర్ణయించిందని… ఒక దానిలోకి మరొకటి జోక్యం చేసుకోకూడదన్నారు. ఇటీవల కొన్ని తీర్పులు చూస్తూనే ఉన్నామన్నారు. ప్రభుత్వంలోకి కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని… కోర్టుల నుంచే ఆదేశాలొస్తున్నాయన్నారు. ప్రభుత్వ విధివిధానాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు ఇలా చేయండి… అలా వద్దు అంటున్నారని… అలాంటప్పుడు […]

Advertisement
Update:2020-07-02 13:01 IST

పరిపాలనలో కోర్టులు నేరుగా జోక్యం చేసుకుంటున్నాయని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా కోర్టు ద్వారా ప్రభుత్వాలను నడిపిస్తారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రతి వ్యవస్థకు బాధ్యతలతో పాటు హద్దులు కూడా నిర్ణయించిందని… ఒక దానిలోకి మరొకటి జోక్యం చేసుకోకూడదన్నారు. ఇటీవల కొన్ని తీర్పులు చూస్తూనే ఉన్నామన్నారు.

ప్రభుత్వంలోకి కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని… కోర్టుల నుంచే ఆదేశాలొస్తున్నాయన్నారు. ప్రభుత్వ విధివిధానాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు ఇలా చేయండి… అలా వద్దు అంటున్నారని… అలాంటప్పుడు ప్రజలెందుకు?, ఎన్నికలెందుకు?, ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌ సభ్యులు ఎందుకు? ముఖ్యమంత్రి, స్పీకర్‌ ఎందుకు? అని ప్రశ్నించారు. డైరెక్ట్‌గా మీరే రూల్ చేస్తారా?, న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాలను నడిపిస్తారా? అని స్పీకర్ ప్రశ్నించారు.

ఇలాంటి కిష్టపరిస్థితులు వస్తాయని రాజ్యాంగ రచయితలు ముందే ఊహించి ఉంటే దీనికి కూడా ఒక ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవారని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News