కరోనా పరీక్షలు పెంచండి " గవర్నర్ తమిళిసై

తెలంగాణలో కరోనా పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉందని.. రోజు రోజుకూ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నందున.. పరీక్షల అవసరం ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ వీటి సంఖ్యను పెంచడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆమె తనిఖీలు నిర్వహించారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బందిని ఆమె అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై పోరాటంలో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని ఆమె చెప్పారు. […]

Advertisement
Update:2020-06-08 11:10 IST

తెలంగాణలో కరోనా పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉందని.. రోజు రోజుకూ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నందున.. పరీక్షల అవసరం ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు.

ఐసీఎంఆర్ నిబంధనల మేరకు ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ వీటి సంఖ్యను పెంచడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆమె తనిఖీలు నిర్వహించారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బందిని ఆమె అభినందించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై పోరాటంలో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని ఆమె చెప్పారు. రాష్ట్రంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా, పారిశుథ్య కార్మికులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని… వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. సిబ్బంది ఎవరూ అధైర్య పడవద్దని.. అందరం కలిసి కట్టుగా ఉండి ఈ మహమ్మారిని తరిమికొడదామని అన్నారు.

ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినా…. అవి సామాన్యులు ఉపాధి కోల్పోవద్దనే ఉద్దేశంతోనే తప్ప కరోనాపై పోరాటాన్ని అలక్ష్యం చేసినట్లు కాదని ఆమె అన్నారు. వైరస్ వ్యాప్తి పట్ల భయపడడంకంటే దాని బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని, ప్రతీ ఒక్కరూ దీన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రపర్చుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నొక్కిచెప్పారు.

Tags:    
Advertisement

Similar News