ఇకపైనా పార్టీ బాధ్యతలు నేనే చూసుకుంటా...

ఇటీవల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. జగన్‌ వెంట తొలి నుంచి కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డిపైనా కొన్ని చానళ్లు పలు కథనాలు ప్రసారం చేశాయి. జగన్‌కు, విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్‌ సృష్టించేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. ఇప్పటి వరకు అవేవీ విజయవంతం కాలేదు. ఈ తరహాలోనే ఇటీవల ఒక ప్రచారం మొదలైంది. విజయసాయిరెడ్డికి జగన్‌ ప్రాధాన్యత తగ్గించారని… ఇకపై విజయసాయిరెడ్డిని కేవలం ఢిల్లీకే పరిమితం చేయబోతున్నారన్నది ఆ ప్రచారం. విజయసాయిరెడ్డి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డికి […]

Advertisement
Update:2020-06-02 02:19 IST

ఇటీవల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. జగన్‌ వెంట తొలి నుంచి కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డిపైనా కొన్ని చానళ్లు పలు కథనాలు ప్రసారం చేశాయి.

జగన్‌కు, విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్‌ సృష్టించేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. ఇప్పటి వరకు అవేవీ విజయవంతం కాలేదు. ఈ తరహాలోనే ఇటీవల ఒక ప్రచారం మొదలైంది. విజయసాయిరెడ్డికి జగన్‌ ప్రాధాన్యత తగ్గించారని… ఇకపై విజయసాయిరెడ్డిని కేవలం ఢిల్లీకే పరిమితం చేయబోతున్నారన్నది ఆ ప్రచారం.

విజయసాయిరెడ్డి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారంటూ కొన్ని చానళ్లు ప్రసారం చేశాయి. ఈ అంశాన్ని విజయసాయిరెడ్డి సోమవారం మీడియా సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

”ఐదున్నరేళ్లుగా పార్టీ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటున్నా… సోషల్ మీడియాను కూడా నేను చూసుకుంటున్నా. మునుముందు కూడా నేనే చూసుకుంటా. కానీ ఇటీవల ఎన్‌టీవీ లాంటి చానల్‌…. పార్టీ అధ్యక్షుడు నన్ను తీసేశారని ప్రచారం చేస్తోంది. ఆన్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. ఇలాంటి దుష్ఫ్రచారం మానుకోండి. నేను జీవితాంతం… నేను చనిపోయే వరకు జగన్‌మోహన్‌ రెడ్డితోనే ఉంటా. ఆయన కోసమే పనిచేస్తా. ఇలాంటి దుష్ఫ్రచారం మానుకోండి. ఇది వరకు ఈనాడు, ఏబీఎన్ ఇలాంటి ప్రచారం చేసేవి. ఇప్పుడు ఎన్‌టీవీ చేరింది. ఎందుకో అర్థం కావడం లేదు. ” అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

పార్టీ వ్యవహారాల నుంచి తనను తప్పించబోతున్నారు అన్న ప్రచారానికి ఈ విధంగా విజయసాయిరెడ్డి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. కేసులు వచ్చినా సరే కార్యకర్తలను వదులుకోబోమని స్పష్టం చేశారు. కోర్టుల నుంచి ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో కార్యకర్తలను దూరం పెట్టబోమని… వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News