జూన్ 19తో వాళ్లు ఎటు వైపో తేలుతుందా?

జూన్‌ 19. రాజ్యసభ ఎన్నికలు. 18 సీట్లకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. కరోనాతో వాయిదా పడ్డాయి. ఇప్పుడు తాజాగా 19న పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏపీలో నాలుగు సీట్లకు ఐదుగురు నామినేషన్లు వేశారు. వైసీపీ నుంచి మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అయోధ్య రామిరెడ్డి, నత్వానీ అభ్యర్థులుగా ఉన్నారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలోకి దిగారు. అయితే సంఖ్యా పరంగా…ఎలా చూసినా […]

Advertisement
Update:2020-06-02 00:42 IST

జూన్‌ 19. రాజ్యసభ ఎన్నికలు. 18 సీట్లకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. కరోనాతో వాయిదా పడ్డాయి. ఇప్పుడు తాజాగా 19న పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఏపీలో నాలుగు సీట్లకు ఐదుగురు నామినేషన్లు వేశారు. వైసీపీ నుంచి మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అయోధ్య రామిరెడ్డి, నత్వానీ అభ్యర్థులుగా ఉన్నారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలోకి దిగారు. అయితే సంఖ్యా పరంగా…ఎలా చూసినా నాలుగు సీట్లు వైసీపీకి దక్కుతాయి. కానీ ఆటలో అరటిపండులాగా ఎస్సీ కార్డుతో వర్లరామయ్యను టీడీపీ బరిలోకి దించింది.

తెలుగుదేశం నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఇద్దరూ సైకిల్‌ దిగారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మద్దాల గిరి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఆయన కొడుకు కరణం వెంకటేష్‌ వైసీపీలో చేరారు. ముగ్గురు ఎమ్మెల్యేల జంప్‌తో టీడీపీ కౌంట్‌ 20కి పడిపోయింది.

ఈ 20 మంది ఎమ్మెల్యేల్లో టీడీపీలో ఎంత మంది ఉంటారు? అనేది చర్చ నడుస్తోంది. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని టీడీపీ బ్యాచ్‌ ప్రచారం చేసింది. కానీ వారు సీఎంను కలవలేదు.

అయితే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల వేళ టీడీపీ వైపు ఎంతమంది ఉంటారు? అనేది తేలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఓటింగ్‌ లో పాల్గొనే ఎమ్మెల్యేలు ఎంత మంది ఓటు వేస్తారు? ఎవరెవరు ఓటింగ్‌కు దూరంగా ఉంటారు? అనేది ఈ రాజ్యసభ ఎన్నికల ద్వారా తేలుతుందని చంద్రబాబు ఎదురుచూస్తున్నారు.

అయితే ఎలాగూ టీడీపీ గెలవదు. దీంతో పక్కాగా వెళ్లి వర్ల రామయ్యకు ఓటు వేసి కొందరు చంద్రబాబుకు మరికొన్ని రోజులు టెన్షన్‌ పెట్టాలనే ప్లాన్‌లో ఉన్నారు. మరికొందరు ఈ ఎన్నికతోనే బాబుకు గట్టి షాక్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో జూన్‌ 19 సరికొత్త సమీకరణాలకు తెరతీస్తుందా? అనేది చూడాలి.

Tags:    
Advertisement

Similar News