గాంధీలో మద్యం పార్టీ వివాదం

పార్టీలో పాల్గొన్న ఒకరు మృతి విచారణకు ఆదేశించిన అధికారులు కరోనా వైరస్ ప్రభావంతో కోవిడ్-19 బారిన పడిన రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆసుపత్రిలో మద్యం పార్టీ కలకలం సృష్టిస్తోంది. ఒకవైపు డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంంది 24 గంటలు కష్టపడి రోగులకు సేవచేస్తుంటే.. కొంత మంది సిబ్బంది ఇలా పార్టీలు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కాగా, మద్యం పార్టీ చేసుకున్న వారిలో ఒకరు మృతి చెందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గాంధీ ఆసుపత్రిలోని సెల్లార్‌లో ఉన్న […]

Advertisement
Update:2020-05-18 06:12 IST
  • పార్టీలో పాల్గొన్న ఒకరు మృతి
  • విచారణకు ఆదేశించిన అధికారులు

కరోనా వైరస్ ప్రభావంతో కోవిడ్-19 బారిన పడిన రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆసుపత్రిలో మద్యం పార్టీ కలకలం సృష్టిస్తోంది. ఒకవైపు డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంంది 24 గంటలు కష్టపడి రోగులకు సేవచేస్తుంటే.. కొంత మంది సిబ్బంది ఇలా పార్టీలు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కాగా, మద్యం పార్టీ చేసుకున్న వారిలో ఒకరు మృతి చెందడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గాంధీ ఆసుపత్రిలోని సెల్లార్‌లో ఉన్న ఒక గదిలో కాంట్రాక్టు సిబ్బంది అయిన శ్రీనివాస్, నరేష్, నగేష్‌తో పాటు మరో ఇద్దరు ఆదివారం రాత్రి మద్యం, మాంసంతో విందు చేసుకున్నారు. వీరిలో శ్రీనివాస్, నరేష్, నగేష్ ముగ్గురూ అన్నదమ్ములు. ఆసుపత్రి సీఎస్‌డీ విభాగానికి చెందిన గదిలో వీళ్లు అయిదుగురు పార్టీ చేసుకునే సమయంలో మద్యం అయిపోవడంతో మరో ఫుల్‌బాటిల్ తెచ్చుకొని ఫుల్లుగా తాగారు. రాత్రంతా తాగుతూ గడిపిన వీళ్లు తెల్లవారుజామున ఇంటికి వెళ్లిపోయారు.

ఇంటికి వెళ్లిన ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకరైన శ్రీనివాస్ (38) ఉదయం హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలోని స్టెరిలైజేషన్ విభాగంలో పని చేసే శ్రీనివాస్ మృతి చెందిన విషయం అధికారులకు తెలిసింది. అంతే కాకుండా అర్థరాత్రి వరకు చేసుకున్న మద్యం పార్టీ విషయం కూడా బయటకు పొక్కింది.

శ్రీనివాస్ మృతి, మద్యం పార్టీపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు విచారణకు ఆదేశించారు. ఒకవైపు ఆసుపత్రిలో కరోనా పేషెంట్లు ఉండగా.. ఇలా పార్టీలు చేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్లార్‌లో కూడా వెంటనే సీసీ కెమేరాలు పెట్టాలని ఆయన ఆదేశించారు. గాంధీ ఆసుపత్రిలో 300 మంది పోలీసులు, 100 మంది సెక్యూరిటీ గార్డులతో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంది. వీరందరి కళ్లుగప్పి మద్యం బాటిల్స్ లోపలికి ఎలా వచ్చాయనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

Tags:    
Advertisement

Similar News