ఈ ఆరోపణలు గతేడాది పత్రికల్లోనూ వచ్చినవే...

ఏపీ ప్రభుత్వంపై చాలా కాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. చిన్న చిన్న అంశాల ఆధారంగానూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే రెండు రోజులుగా కన్నా లక్ష్మీనారాయణకు వైసీపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు కన్నాపై వరుస ప్రెస్‌మీట్లతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన ప్రెస్‌మీట్లో … మొన్నటి ఎన్నికల సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర బీజేపీ […]

Advertisement
Update:2020-04-22 14:55 IST

ఏపీ ప్రభుత్వంపై చాలా కాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. చిన్న చిన్న అంశాల ఆధారంగానూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే రెండు రోజులుగా కన్నా లక్ష్మీనారాయణకు వైసీపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు కన్నాపై వరుస ప్రెస్‌మీట్లతో విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన ప్రెస్‌మీట్లో … మొన్నటి ఎన్నికల సమయంలో కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర బీజేపీ పంపిన నిధులను కాజేశారని ఆరోపించారు. ఇది నిజం కాదేమో కాణిపాకం ఆలయంలో కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ఈ ఆరోపణ ఎన్నికల సమయంలోనూ పత్రికల్లో కూడా వచ్చింది.

ఏపీ బీజేపీలో ఎన్నికల ఫండ్‌ను కొందరు పెద్దలు కాజేశారని నాడు ఆంధ్రప్రభ పత్రికతో పాటు టీడీపీ అనుకూల రెండో పత్రికలో కూడా వచ్చింది. గతేడాది ఏప్రిల్ మొదటి వారంలో ఈ కథనాలు వచ్చాయి.

టీడీపీ అనుకూల రెండో పత్రిక… ఈ నిధుల గోల్‌ మాల్‌పై అమిత్ షా సీరియస్‌ అయ్యారు అని రాసింది. దాంతో పార్టీ కోశాధికారి సన్యాసిరాజుతో పాటు, ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి రాజీనామా చేశారని రాసింది.

అప్పటికే రాష్ట్రానికి చేరిన 70 కోట్లలో 30 కోట్లను రాష్ట్రానికి చెందిన కీలక నాయకుడు దారి మళ్లించినట్టు కేంద్ర పార్టీకి రిపోర్టు కూడా అందినట్టు అప్పట్లో టీడీపీ అనుకూల రెండో పత్రిక రాసింది. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఆ విషయాన్నే ప్రస్తావిస్తుండడంతో కన్నా లక్ష్మీనారాయణ ఇరుకునపడ్డారు.

Tags:    
Advertisement

Similar News