ఏంటి బాబూ ఇదీ... గతంలో మీరు చేసినవి గుర్తులేవా..?

రాజకీయాల్లో నాకు 40 ఏండ్ల అనుభవం ఉంది.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు చేసే రాజకీయం ఎలా ఉంటుందో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత గత 10 నెలలుగా చంద్రబాబు చాలా ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. అయిన దానికీ కాని దానికి అధికారపార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ మీద ఉన్న కోపాన్ని ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంపై చూపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలిసో తెలియకో ప్రభుత్వ కార్యాలయాలపై […]

Advertisement
Update:2020-04-18 05:41 IST

రాజకీయాల్లో నాకు 40 ఏండ్ల అనుభవం ఉంది.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు చేసే రాజకీయం ఎలా ఉంటుందో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత గత 10 నెలలుగా చంద్రబాబు చాలా ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. అయిన దానికీ కాని దానికి అధికారపార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ మీద ఉన్న కోపాన్ని ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంపై చూపిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలిసో తెలియకో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు మార్చారు. సరే వైసీపీ చేసిన పనిపై హైకోర్టు ఏం చెప్పిందో కాసేపు పక్కన పెడితే అసలు తెలుగుదేశం హయాంలో ఏం చేశారో చూద్దాం.

అసలీ రంగుల రాజకీయం మొదలు పెట్టిందే చంద్రబాబు కాదా..? అధికారంలో ఉన్నప్పుడు తాను అమలు చేసిన ప్రతీ పథకాలకు పసుపు రంగు అంటించలేదనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రక్షిత మంచి నీటి పథకాల నుంచి మరుగు దొడ్ల వరకు అన్నింటినీ పసుపుమయం చేసింది చంద్రబాబే కదా..! అన్న క్యాంటీన్ల పేరుతో కట్టిన తాత్కాలిక నిర్మాణాలన్నీ పసుపు రంగులోనే ఉంటాయి కదా.

ఇక చంద్రన్న పథకాలకు ఇచ్చిన సంచుల రంగులు కూడా పసుపే. మరి తాను అధికారంలో ఉన్నప్పుడు అంతా పసుపు మయం చేసి ఇప్పుడు మాత్రం అధికార పార్టీపై విరుచుకుపడటం చూస్తుంటే గురివింద గింజ సామెతే గుర్తుకువస్తోంది.

చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. తాను అధికారంలో ఉన్నా లేకున్నా అందరూ తన మాటే వినాలని అనుకుంటుంటారు అని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు ఎవరూ బాబును పట్టించుకోకపోవడం వల్లే ప్రజా సమస్యలను గాలికి వదిలి ఇలా పనీ పాటా లేని కేసులు వేస్తూ కాలం వెల్లదీస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు.

ఇక చంద్రబాబుకు ఆయన కొడుకు నారా లోకేష్ కూడా వంత పాడుతున్నారు. వైసీపీ రంగుల కోసం 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటూ ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపారు. అసలు పెయింటింగ్స్‌కు అన్ని కోట్ల ఖర్చు అవుతుందా? అనే చిన్న ఆలోచన కూడా లేకుండా నోటికి వచ్చినట్లు ఆయన మాట్లాడున్నారు.

ప్రభుత్వ అధికారులే 50 కోట్ల రూపాయల కంటే తక్కువ వ్యయమే అయ్యుంటుందని చెబుతున్నా.. తన అబద్దపు ప్రచారం మాత్రం ఆపట్లేదు. ప్రతిపక్షంలోకి వెళ్లాక చంద్రబాబు, చినబాబులకు ఫ్రస్ట్రేషన్ పీక్స్‌లోకి వెళ్లిందని.. అందుకే చివరకి కరోనా కట్టడి చర్యలపై కూడా ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి దిగజారారని పలువురు చర్చించుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News