షాబాజ్ నదీమ్ దాతృత్వం

350 కుటుంబాలకు సాయం కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా 190కి పైగా దేశాలలో కోట్లామంది ఓవైపు అల్లాడిపోతూ ఉంటే…ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సేవాసంస్ధలు, శ్రీమంతులు, ఆర్థికస్థోమతుకలవారు…తమకు తోచినంత సాయిం చేస్తూ వస్తున్నారు. కోట్లకు పడగలెత్తినవారు సాయం చేయటం అసలు విషయమే కాదు. అయితే అంతంత మాత్రం ఆర్థికస్థోమతు కలిగినవారు చేసిన సాయమే గొప్పసాయంగా మిగిలిపోతుంది. కరోనా వైరస్ బ్రేక్ డౌన్ తో దేశంలో ఉపాథికోల్పోయిన 80 కోట్ల మంది సగటు జనంతో పాటు…వలస కార్మికులు, దినసరి వేతన జీవుల […]

Advertisement
Update:2020-04-03 12:10 IST
  • 350 కుటుంబాలకు సాయం

కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా 190కి పైగా దేశాలలో కోట్లామంది ఓవైపు అల్లాడిపోతూ ఉంటే…ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సేవాసంస్ధలు, శ్రీమంతులు, ఆర్థికస్థోమతుకలవారు…తమకు తోచినంత సాయిం చేస్తూ వస్తున్నారు.

కోట్లకు పడగలెత్తినవారు సాయం చేయటం అసలు విషయమే కాదు. అయితే అంతంత మాత్రం ఆర్థికస్థోమతు కలిగినవారు చేసిన సాయమే గొప్పసాయంగా మిగిలిపోతుంది.

కరోనా వైరస్ బ్రేక్ డౌన్ తో దేశంలో ఉపాథికోల్పోయిన 80 కోట్ల మంది సగటు జనంతో పాటు…వలస కార్మికులు, దినసరి వేతన జీవుల కోసం కేంద్రప్రభుత్వం కోటీ 70 లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని ఇప్పటికే ప్రకటించింది.

దీనికితోడు…బీసీసీఐ లాంటి అత్యంత ధనిక క్రీడాసంఘం 51 కోట్ల రూపాయల సాయం ప్రకటిస్తే…రోహిత్ శర్మ 80 లక్షలు, సచిన్ టెండుల్కర్ 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.

బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ తనవంతుగా 50 లక్షల రూపాయల విలువైన బియ్యాన్ని బెంగాల్ లోని నిరుపేదలకు పంచిపెట్టాడు. అయితే బెంగాల్ క్రికెట్ జట్టు సభ్యుడు, భారత స్పిన్నర్ షాబాజ్ నదీమ్ మాత్రం తనకు అంతంత మాత్రం ఆర్థికస్థోమతు మాత్రమే ఉన్నా…. ఎలాంటి ప్రచారం లేకుండా 350 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించాడు.

ధన్ బాద్ లోని ఝరియాకు చెందిన 30 సంవత్సరాల షాబాజ్ నదీమ్ 16 సంవత్సరాల తన క్రికెట్ కెరియర్ లో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడగలిగాడు. గతంలో జార్ఖండ్ జట్టులో సభ్యుడిగా రంజీట్రోఫీతో సహా పలు దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ల్లో పాల్గొన్న నదీమ్ ప్రస్తుతం బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News