దేశ ప్రజలకు ప్రధాని మోదీ మరో సందేశం

కరోనా ఆంక్షలు కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు మరో సందేశాన్ని ఇచ్చారు. జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం చప్పట్లు కొట్టి వైద్యులను, పోలీసులను, పారిశుద్ధ్య సిబ్బందిని, మీడియాను ప్రజలంతా అభినందించిన మాదిరిగానే మరో చర్యను చేపట్టాలని పిలుపునిచ్చారు. అదేంటంటే.. ఈ నెల 5న.. అంటే ఆదివారం నాడు.. రాత్రి 9 గంటల నుంచి 9 నిముషాల సమయాన్ని తన కోసం.. దేశం కోసం కేటాయించాలని కోరారు. ఆ సమయంలో లైట్లన్నీ ఆర్పేసి […]

Advertisement
Update:2020-04-03 05:05 IST

కరోనా ఆంక్షలు కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు మరో సందేశాన్ని ఇచ్చారు. జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం చప్పట్లు కొట్టి వైద్యులను, పోలీసులను, పారిశుద్ధ్య సిబ్బందిని, మీడియాను ప్రజలంతా అభినందించిన మాదిరిగానే మరో చర్యను చేపట్టాలని పిలుపునిచ్చారు. అదేంటంటే.. ఈ నెల 5న.. అంటే ఆదివారం నాడు.. రాత్రి 9 గంటల నుంచి 9 నిముషాల సమయాన్ని తన కోసం.. దేశం కోసం కేటాయించాలని కోరారు.

ఆ సమయంలో లైట్లన్నీ ఆర్పేసి కేవలం కొవ్వత్తులు, దివ్వెలను వెలిగించాలని కోరారు. ఈ చర్యతో.. కరోనాను తిప్పికొట్టే సంకల్పాన్ని తీసుకోవాలని ప్రజలను అభ్యర్థించారు. 130 కోట్ల మంది ప్రజలు ఈ యజ్ఞంలో భాగం కావాలని విజ్ఞప్తి చేశారు. కష్టపూరితమైన సమయంలో ఈ చర్య… దేశ ప్రజలకు శక్తిని, సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. సంకల్పాన్ని మించిన శక్తి.. ప్రపంచంలో ఏదీ ఉండదని మోదీ అభిప్రాయపడ్డారు.

ఇక.. జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలు చూపిన ఐకమత్యాన్ని ప్రధాని ప్రశంసించారు. ప్రజలంతా ఏకమై కరోనాను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మన దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని.. ప్రపంచ దేశాలన్నీ మన బాటలోనే ఇప్పుడు నడుస్తున్న విషయాన్ని గమనించాలని ప్రధాని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి కరోనాను జయించాలని.. లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇంట్లో ఉంటే ఒంటరి కారని చెప్పారు. సామాజిక దూరమనే లక్ష్మణ రేఖను ఎవరూ దాటవద్దని మరోసారి తన సందేశంతో ప్రధాని ప్రజలందరినీ కోరారు.

Tags:    
Advertisement

Similar News