30 లక్షలు ఆర్జిస్తే చాలనుకొన్న ధోనీ

800కోట్ల క్రికెట్ శ్రీమంతుడుగా మహీ జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీతో తన డ్రెస్సింగ్ రూమ్ అనుభవాలను భారత మాజీ ఓపెనర్, దేశవాళీ క్రికెట్ దిగ్గజం వాసిం జాఫర్ గుర్తు చేసుకొన్నాడు. 2004 డిసెంబర్ లో తన క్రికెట్ కెరియర్ ప్రారంభించిన తొలిరోజుల్లో…వాసిం జాఫర్ తో కలిసి మెలిసి తిరిగాడు. తన భావాలను పంచుకొన్నాడు. క్రికెట్ ద్వారా 30 లక్షలు సంపాదిస్తే చాలునని…రాంచీలో సొంత ఇల్లు నిర్మించుకొని హాయిగా బతికేస్తానని ధోనీ తరచూ చెబుతూ ఉండేవాడని జాఫర్ గుర్తు చేసుకొన్నాడు. అంతేకాదు […]

Advertisement
Update:2020-03-30 05:06 IST
  • 800కోట్ల క్రికెట్ శ్రీమంతుడుగా మహీ

జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీతో తన డ్రెస్సింగ్ రూమ్ అనుభవాలను భారత మాజీ ఓపెనర్, దేశవాళీ క్రికెట్ దిగ్గజం వాసిం జాఫర్ గుర్తు చేసుకొన్నాడు.

2004 డిసెంబర్ లో తన క్రికెట్ కెరియర్ ప్రారంభించిన తొలిరోజుల్లో…వాసిం జాఫర్ తో కలిసి మెలిసి తిరిగాడు. తన భావాలను పంచుకొన్నాడు. క్రికెట్ ద్వారా 30 లక్షలు సంపాదిస్తే చాలునని…రాంచీలో సొంత ఇల్లు నిర్మించుకొని హాయిగా బతికేస్తానని ధోనీ తరచూ చెబుతూ ఉండేవాడని జాఫర్ గుర్తు చేసుకొన్నాడు.

అంతేకాదు గత 15 సంవత్సరాల కాలంలో అత్యంత విజయవంతమైన భారత క్రికెటర్ గా ధోనీ నిలిచాడు. మార్కెట్ రేటు ప్రకారం ధోనీ 800 కోట్ల రూపాయలు ఆర్జించగలిగాడు.

భారత్ కు 2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 మినీ ప్రపంచకప్ అందించిన ఏకైక కెప్టెన్ గా కూడా ధోనీ చరిత్ర సృష్టించాడు.

8 మాసాలుగా క్రికెట్ కు దూరం….

క్రికెట్టే ఊపిరిగా, జీవితంగా భావించిన మహేంద్ర సింగ్ ధోనీ తన కెరియర్ లో చివరిసారిగా ఎనిమిదిమాసాల క్రితం ఓ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ తో తన ఆఖరి వన్డే మ్యాచ్ ఆడిన ధోనీ ఆ తర్వాత నుంచి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు.

మార్చి 29న ప్రారంభమయ్యే ఐపీఎల్ 13వ సీజన్లో రాణించడం ద్వారా తిరిగి భారతజట్టులో చోటు సంపాదించాలని భావించాడు. కరోనా వైరస్ దెబ్బతో ఐపీఎల్ ఏప్రిల్ 15 కు వాయిదా పడటంతో ధోనీ రీఎంట్రీ పైన రిటైర్మెంట్ మేఘాలు కమ్ముకొన్నాయి.

ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్ లో జరిగే 2020 ప్రపంచకప్ లో పాల్గొనడం ద్వారా…రిటైర్మెంట్ తీసుకోవాలని భావించిన ధోనీకి… కరోనా వైరస్ నిరాశనే మిగిల్చింది.

ధోనీకి తిరిగి భారతజట్టులో చోటు దక్కడం అనుమానమేనని సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి క్రికెటర్లు, కామెంటీటర్ హర్ష బోగ్లే అంటున్నారు. ధోనీ ఎలాంటి ఆర్భాటమూ లేకుండా రిటైర్మెంట్ ప్రకటించక తప్పదని చెప్పారు.

మరోవైపు…ధోనీ చిన్ననాటి కోచ్ మాత్రం దింపుడుకల్లం ఆశతో ఉన్నారు. కరోనా వైరస్ ఉపశమించి సాధారణ పరిస్థితులు నెలకొంటే… టీ-20 ప్రపంచకప్ లో ధోనీకి అవకాశం దొరకడం ఏమంత కష్టంకాదని ధీమాగా చెబుతున్నారు.

ఏదిఏమైనా గత 15 సంవత్సరాలుగా భారత క్రికెట్ కు మరపురాని విజయాలు అందించిన కూల్ కూల్ కెప్టెన్ ధోనీ…తనకు నచ్చిన విధంగా రిటైర్ కావాలని కోట్లాదిమంది అభిమానులు కోరుకొంటున్నారు.

30 లక్షలు సంపాదిస్తే చాలు అనుకొన్న ధోనీ ఏకంగా 800 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడంతో పాటు…భారత్ కు మూడు ప్రపంచకప్ లు అందించడం, వెనుకబడిన రాష్ట్ర్రం జార్ఖండ్ కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం అపూర్వమే మరి.

Tags:    
Advertisement

Similar News