ఢిల్లీలో తుగ్లక్ లేన్ పేరు మార్పు?

ప్రసిద్ధి చెందిన తుగ్లక్ లేన్ పేరును స్వామి వివేకానంద మార్గ్‌గా మార్చే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.;

Advertisement
Update:2025-03-07 16:22 IST

దేశ రాజధానిలోని ప్రముఖ మార్గం తుగ్లక్ లేన్ పేరు స్వామి వివేకానంద మార్గ్‌గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ దినేశ్‌శర్మ, కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ తమ ఇంటి బయట నేమ్‌ప్లేట్‌లో వివేనంద మార్గ్ అని మార్చకోవడంతో రాజకీయవర్గాల్లో ఇప్పుడు పేర్లు మార్పుపై చర్చ జరుగుతుంది. ఇటీవల ఢిల్లీలోనూ అధికారం దక్కించుకున్న కమలం పార్టీ అక్కడి పలు ప్రాంతాల పేర్లను మార్చాలని యోచిస్తున్నట్లు టాక్. రాజధానిలో మొఘల్ కాలం నాటి పేర్లను కలిగి ఉన్న రోడ్ల పేరు మార్చాలనే చాలా కాలంగా ఉన్న డిమాండ్ క్రమంగా రూపుదిద్దుకుంటోంది.

దీనికి ఇటీవలి ఉదాహరణ తుగ్లక్ లేన్, ఇక్కడ అనేక మంది నాయకులు మరియు ఉన్నతాధికారుల నివాసాలపై కొత్త నేమ్‌ప్లేట్‌లను ఏర్పాటు చేస్తున్నారు, ప్రముఖంగా "స్వామి వివేకానంద మార్గ్" మరియు "తుగ్లక్ లేన్" అని కింద చిన్న అక్షరాలలో చెక్కబడి ఉన్నాయి.ప్రసిద్ధి చెందిన తుగ్లక్ లేన్ పేరును స్వామి వివేకానంద మార్గ్‌గా మార్చే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.

Tags:    
Advertisement

Similar News