కాంగ్రెస్‌లో ఉంటూ కొందరు బీజేపీతో పనిచేస్తున్నారు
గుజరాత్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు;
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గుజరాత్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ కొందరు బీజేపీతో పనిచేస్తున్నారు. బీజేపీతో కలిసి పనిచేసేవారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామన్నారు. అహ్మదాబాద్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. గుజరాత్ ప్రజలు నిజమైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని.. బీజేపీకి బీ టీమ్ కాదని పేర్కొన్నారు. బీజేపీతో రహస్యంగా సంబంధాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలందరినీ పార్టీ బహిష్కరించాలని రాహుల్ గాంధీ అన్నారు. ఇలాంటి వారు బీజేపీ కోసం బహిరంగంగా పనిచేయనివ్వండి. వారిని ఆ పార్టీ కూడా అంగీకరించదని నాకు కచ్చితంగా తెలుసు అన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికీ మంచి ఓటింగ్ శాతాన్ని పొందుతున్నదని అన్నారు.గుజరాత్ లో సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీజేపీకి బీటీమ్ గా ఉన్నవారిని బైటికి పంపుతాం. బీజేపీకి అనుకూలంగా ఉన్న ఎవ్వరినీ వదిలిపెట్టేలేదు. కాంగ్రెస్ పార్టీలో నేతలకు కొదువలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 22 శాతం ఓట్లు పెరిగాయని.. అసాధ్యం అనుకున్న చోట వారు సాధించి చూపెట్టారని తెలిపారు.గుజరాత్ నూ కాంగ్రెస్ కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్నది. కానీ దానికి భిన్నంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్ఠను రోజురోజుకూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.. అందరూ పార్టీ లైన్ లో ఉండి పనిచేయాల్సిందే.. గీత దాటిన వారిపై వేటు వేయడానికి ఎంతో సమయం పట్టదన్నారు.
అలాగే గత 30 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలో లేదు. నేను ఇక్కడికి వచ్చిన ప్రతీసారి 2007, 2012, 2017, 2002, 2027 అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చలు జరుగుతాయి. కానీ ప్రశ్న ఎన్నికల గురించి కాదు. మన బాధ్యతలను నెరవేర్చే వరకు గుజరాత్ ప్రజలు మనల్ని ఎన్నికల్లో గెలిపించరు. ప్రజల పట్ల మనం బాధ్యతతో ఉన్న రోజునే మనకు అధికారం ఇస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రత్యామ్నాయంగా ఉండాలి, బీజేపీ 'బీ టీం' కాదు అని రాహుల్ గాంధీ అన్నారు.గుజరాత్‌లో బీజేపీతో సంబంధం ఉన్న కాంగ్రెస్ నాయకులను ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లో కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీతో పనిచేసే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు..