నిర్భయ దోషులకు ఉరి.... చివరి క్షణం వరకు ఉత్కంఠ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి శిక్ష అమలు చేశారు. ఉరి శిక్ష అమలుకు గంట ముందు వరకు దోషులు శిక్షను తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ వారు దాఖలు చేసిన పిటిషన్లు అన్నింటినీ కోర్టు కొట్టేసింది. దీంతో ఇవాళ ఉదయం ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లను తీహార్ […]

Advertisement
Update:2020-03-20 02:40 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి శిక్ష అమలు చేశారు. ఉరి శిక్ష అమలుకు గంట ముందు వరకు దోషులు శిక్షను తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ వారు దాఖలు చేసిన పిటిషన్లు అన్నింటినీ కోర్టు కొట్టేసింది. దీంతో ఇవాళ ఉదయం ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లను తీహార్ జైలులో ఉరి తీశారు.

వీరిని ఉరి తీసే సమయంలో పలువురు జైలు అధికారులతో పాటు, జిల్లా మెజిస్ట్రేట్ అక్కడ ఉన్నారు. జైలు నెంబర్ 3లో ఒకే సారి నలుగురికి ఉరి శిక్షను అమలు చేశారు. ఇక గురువారం రోజు సుప్రీంలో విచారణ సమయంలో దోషి ముఖేష్ సింగ్ తాను ఢిల్లీలో లేనంటూ వాదించాడు. దీనితో సుప్రీం ఏకీభవించలేదు. చట్టపరంగా అన్ని మార్గాలూ మూసుకొని పోయిన తర్వాత కొత్త వాదనలకు అవకాశం లేదని జస్టీస్ భానుమతి, జస్టీస్ అశోక్ భూషణ్, జస్టీస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇక, తాను సమర్పించిన రెండో క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఇంకో దోషి అక్షయ్ కుమార్ పెట్టుకున్న దరఖాస్తును కూడా ఇదే ధర్మాసనం తిరస్కరించింది. ఇక పవన్ కుమార్ పెట్టిన క్యురేటీవ్ పిటిషన్‌ను జస్టీస్ ఎన్‌వీ రమణ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం తిరస్కరించింది. ఉరి శిక్ష అమలు చేయాలన్న పటియాలా హౌస్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరి అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

దీంతో అర్థరాత్రి దాటిన తర్వాత నిర్భయ దోషులు ఉరి శిక్ష నిలుపుదల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఉరి శిక్ష అమలుకు మార్గం సుగమమైంది. 2012 డిసెంబర్ 16న నిర్భయపై అఘాయిత్యం జరగగా.. 2020 మార్చి 20న దోషులకు శిక్ష అమలైంది.

Tags:    
Advertisement

Similar News