ఎమ్మెల్సీగా కవిత... మంత్రి పదవి కూడా వరిస్తుందా?
ఓ సస్పెన్స్‌కు తెరపడింది. నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్న కవిత..మళ్లీ యాక్టివ్ అయ్యే సందర్భం వచ్చింది. దాదాపు ఏడాది పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె మళ్లీ క్రియాశీలం కాబోతున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవితను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగుస్తోంది. దీంతో ఇవాళ ఆమె నామినేషన్ వేయబోతున్నారు. కవితను రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగింది. అయితే ఆమె ప్లేస్‌లో అదే జిల్లాకు చెందిన కేఆర్ […]
ఓ సస్పెన్స్‌కు తెరపడింది. నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్న కవిత..మళ్లీ యాక్టివ్ అయ్యే సందర్భం వచ్చింది. దాదాపు ఏడాది పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె మళ్లీ క్రియాశీలం కాబోతున్నారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవితను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగుస్తోంది. దీంతో ఇవాళ ఆమె నామినేషన్ వేయబోతున్నారు. కవితను రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగింది. అయితే ఆమె ప్లేస్‌లో అదే జిల్లాకు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి పెద్దల సభకు వెళ్లారు. దీంతో ఈమెకు ఎమ్మెల్సీ రూట్ క్లియర్ అయింది. సురేష్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి… కవితను రాజ్యసభకు పంపుతారని అనుకున్నారు. కానీ రాజ్యసభకు వెళ్లేందుకు కవిత ఒప్పుకోలేదట. దీంతో ఆమె ఎమ్మెల్సీ కాబోతున్నారు.
నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో కవిత భేటీ అయ్యారు. మంత్రుల క్వార్టర్స్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. అక్కడే నిజామాబాద్ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలుస్తారు. ఆ తర్వాత నిజామాబాద్‌కు వెళ్లి ఈ రోజు మధ్యాహ్నం కవిత నామినేషన్ వేయనున్నారు.
కవిత ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఇక ఆమెకు రాష్ట్ర కేబినెట్‌లో కూడా స్థానం కల్పిస్తారా? అనే ఊహగానాలు మొదలయ్యాయి. రాజ్యసభ ఎంపీ అయితే ఏదో ఒక జిల్లాకు ప్రాతినిధ్యం వహించే చాన్స్ఉండదు. అదే ఎమ్మెల్సీ అయితే నిజామాబాద్ రాజకీయాలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఆమె అటువైపు మొగ్గుచూపినట్లు ప్రచారం జరుగుతోంది.