మాజీ మంత్రి గంటాకు షాక్... ఆస్తుల వేలం
మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు అనుకోని షాక్ ఎదురైంది. ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా.. ఎంతో పేరున్న గంటా ఆస్తుల వేలానికి బ్యాంకు పత్రికా ప్రకటన విడుదల చేయడం కలకలం రేపింది. గంటా శ్రీనివాస్ రావుకు చెందిన ప్రత్యూష కంపెనీలో మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఉన్నారు. ఈ కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి గతంలో రూ.141.68 కోట్ల రూపాయలు రుణం తీసుకుంది. కానీ రుణం తీర్చలేదు. ఇప్పుడు అసలు వడ్డీ కలిపి రూ.220.66 కోట్ల రూపాయలు దాటింది. […]
మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు అనుకోని షాక్ ఎదురైంది. ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా.. ఎంతో పేరున్న గంటా ఆస్తుల వేలానికి బ్యాంకు పత్రికా ప్రకటన విడుదల చేయడం కలకలం రేపింది.
గంటా శ్రీనివాస్ రావుకు చెందిన ప్రత్యూష కంపెనీలో మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఉన్నారు. ఈ కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి గతంలో రూ.141.68 కోట్ల రూపాయలు రుణం తీసుకుంది. కానీ రుణం తీర్చలేదు. ఇప్పుడు అసలు వడ్డీ కలిపి రూ.220.66 కోట్ల రూపాయలు దాటింది.
అయితే గంటా కంపెనీ బ్యాంకుకు రుణం చెల్లించలేదు. రుణం మొత్తం ఎగవేయడంతో ఇప్పటికే ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంక్ వాటిని వేలం వేసి ఆ మొత్తం రాబట్టుకోవడానికి సిద్ధమైంది.
ఇండియన్ బ్యాంకు ఏప్రిల్ 16న వేలం పద్ధతిలో గంటా కంపెనీ ఆస్తులను అమ్మడానికి తాజాగా ప్రకటన జారీ చేసింది. వేలం వేయనున్న ఆస్తుల్లో బాలయ్య శాస్త్రి లేఅవుట్ లోని గంటాకు చెందిన ఫ్లాట్ ఉంది. ప్రత్యూష సంస్థ డైరెక్టర్ల ఆస్తుల వేలానికి కూడా ఇండియన్ బ్యాంక్ రంగం సిద్ధం చేసింది. వేలంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈ నెల 11 నుంచి 15 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను బ్యాంకు ఆహ్వానించింది.