టీడీపీకి షాక్... జనాల్లోకి వెళ్లాలా... ఎన్నికలకు సిద్ధం కావాలా?

త్వరలోనే జనాల్లోకి వెళ్లి 45 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తిరిగి.. జగన్ ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపి.. జనానికి దగ్గరవుదామని టీడీపీ నాయకత్వం ఇటీవల నిర్ణయించింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి నుంచి మొదలుపెట్టి…. మరిన్ని విషయాల వరకు జనంతో మమేకం కావాలని, ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల ఇన్ ఛార్జుల ఆధ్వర్యంలో యాత్ర చేయాలని అనుకుంది. కానీ.. ఆ ప్రయత్నానికి ఇప్పుడు ఆటంకం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి […]

Advertisement
Update:2020-02-13 04:04 IST

త్వరలోనే జనాల్లోకి వెళ్లి 45 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తిరిగి.. జగన్ ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపి.. జనానికి దగ్గరవుదామని టీడీపీ నాయకత్వం ఇటీవల నిర్ణయించింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి నుంచి మొదలుపెట్టి…. మరిన్ని విషయాల వరకు జనంతో మమేకం కావాలని, ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల ఇన్ ఛార్జుల ఆధ్వర్యంలో యాత్ర చేయాలని అనుకుంది.

కానీ.. ఆ ప్రయత్నానికి ఇప్పుడు ఆటంకం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ నెల 17 నుంచే యాత్రకు టీడీపీ నిర్ణయించింది. ఇంతలోనే పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. సహకార, నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదే నిజమైతే…. టీడీపీకి ప్రజా చైతన్య యాత్ర చేసే అవకాశం ఎంత వరకు ఉంటుందన్నది ఆలోచించాల్సిందే అని చాలా మంది అనుకుంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 15 లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో… ఇప్పుడు టీడీపీ ఎలా స్పందించనుందన్నదే ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి వరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం ఉంటుంది. అభ్యర్థుల ఎంపికనుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకూ చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ఇలాంటి తరుణంలో.. ప్రజా చైతన్య యాత్ర టీడీపీకి కాస్త కష్టమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చూడాలి మరి.. ప్రభుత్వం ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. టీడీపీ ఎలా స్పందిస్తుందో.

Tags:    
Advertisement

Similar News