కేసీఆర్ బర్త్ డేకు కేటీఆర్ ఇచ్చే కానుక ఇదే....
తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే వస్తోంది. ఫిబ్రవరి 17న టీఆర్ఎస్ అధినేత 66వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. వరుస విజయాలతో వచ్చిన ఊపు.. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో కేసీఆర్ బర్త్ డే నాడు శుభాకాంక్షలు, వివిధ కార్యక్రమాలు చేయడానికి గులాబీ శ్రేణులంతా రెడీ అయ్యారు. తెలంగాణ అంతటా సార్ బర్త్ డేను ఓ రేంజ్ లో చేయడానికి రెడీ అయ్యారు. అయితే తండ్రి బర్త్ డే వేడుకకు కేటీఆర్ కూడా ఓ భారీ కానుకను రెడీ చేయడం […]
తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే వస్తోంది. ఫిబ్రవరి 17న టీఆర్ఎస్ అధినేత 66వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. వరుస విజయాలతో వచ్చిన ఊపు.. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో కేసీఆర్ బర్త్ డే నాడు శుభాకాంక్షలు, వివిధ కార్యక్రమాలు చేయడానికి గులాబీ శ్రేణులంతా రెడీ అయ్యారు. తెలంగాణ అంతటా సార్ బర్త్ డేను ఓ రేంజ్ లో చేయడానికి రెడీ అయ్యారు.
అయితే తండ్రి బర్త్ డే వేడుకకు కేటీఆర్ కూడా ఓ భారీ కానుకను రెడీ చేయడం గమనార్హం. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్న కేటీఆర్ తెలంగాణలో ఎంపీ ఎన్నికలు మినహా అన్నింటిని గెలిపించి తండ్రికి కానుకగా ఇచ్చాడు. ఇప్పుడు గులాబీ శ్రేణులకు కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ మహత్కార్యం నిర్వహిద్దామని పిలుపునిచ్చాడు.
ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈసారి ఆయన బర్త్ డే ను వినూత్నంగా నిర్వహించాలని కేటీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ కు మొక్కలంటే ప్రాణం అని.. అందుకే ఆయన హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని.. ఆయన ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ బర్త్ డే నాడు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కూడా తలో మొక్క నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఒక్కొక్కరు ఒక మొక్క నాటాలని… ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని.. పూలబొకేలు, శాలువాలతో సన్మానాల కంటే ఒక్కొక్క మొక్క నాటితే మంచిది అని కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో కేసీఆర్ బర్త్ డే నాడు తెలంగాణ వ్యాప్తంగా లక్షల మొక్కలు నాటేందుకు గులాబీ దండు సిద్ధమవుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ పేరిట ఈ హరితహారాన్ని విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారు.