హాకీ ప్రో లీగ్ లో భారత్ మరో సంచలనం

విశ్వవిజేత బెల్జియంపై విజయం ప్రపంచ హాకీ సమాఖ్య ప్రో-లీగ్ లో 5వ ర్యాంకర్ భారత్ విజయ పరంపర కొనసాగుతోంది. లీగ్ తొలి రౌండ్ లో మూడో ర్యాంకర్ హాలెండ్ ను చిత్తు చేసిన భారత్… రెండో రౌండ్లో ప్రపంచ చాంపియన్ బెల్జియం పైన సైతం సంచలన విజయం సాధించింది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో రౌండ్ తొలి అంచె పోటీలో ప్రపంచ నంబర్ వన్ బెల్జియం ను 2-1 గోల్స్ తో కంగు తినిపించింది. […]

Advertisement
Update:2020-02-09 03:30 IST
  • విశ్వవిజేత బెల్జియంపై విజయం

ప్రపంచ హాకీ సమాఖ్య ప్రో-లీగ్ లో 5వ ర్యాంకర్ భారత్ విజయ పరంపర కొనసాగుతోంది. లీగ్ తొలి రౌండ్ లో మూడో ర్యాంకర్ హాలెండ్ ను చిత్తు చేసిన భారత్… రెండో రౌండ్లో ప్రపంచ చాంపియన్ బెల్జియం పైన సైతం సంచలన విజయం సాధించింది.

భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో రౌండ్ తొలి అంచె పోటీలో ప్రపంచ నంబర్ వన్ బెల్జియం ను 2-1 గోల్స్ తో కంగు తినిపించింది.

సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిన ఈ పోటీ రెండో నిముషంలోనే ఫీల్డ్ గోల్ ద్వారా…మన్ దీప్ సింగ్…భారత్ కు 1-0 ఆధిక్యం సంపాదించిపెట్టాడు.

ఆ తర్వాత బెల్జియం స్టార్ ప్లేయర్ గోతియెర్ బొకార్డ్ పెనాల్టీ కార్నర్ ద్వారా 33వ నిముషంలో తన జట్టుకు ఈక్వలైజర్ సాధించడంతో స్కోరు 1-1తో సమమయ్యింది. ఆ తర్వాతి క్వార్టర్లలో విజయానికి అవసరమైన గోల్ కోసం రెండుజట్లు నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డాయి.

ఆట 47వ నిముషంలో రమణ దీప్ సింగ్ సాధించిన గోల్ తో భారత్ 2-1తో పైచేయి సాధించడమే కాదు… తుదివరకూ ఆధిక్యాన్ని కాపాడి విజయం సొంతం చేసుకోగలిగింది. ఈ విజయంతో భారత్ తన ర్యాంక్ ను 5 నుంచి 4కు మెరుగుపరచుకోగలిగింది.

అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2003లో ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టిన నాటినుంచి భారత్ అత్యుత్తమంగా నాలుగో ర్యాంక్ సాధించడం ఇదే మొదటిసారి.

కళింగ స్టేడియం వేదికగానే ఆదివారం జరిగే రెండో అంచె పోటీలో తిరిగి ఈ రెండుజట్లూ తలపడనున్నాయి.

ఇప్పటికే… టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సంపాదించిన భారత్… ప్రపంచ హాకీ సమాఖ్య ప్రో-లీగ్ లో సైతం 3వ ర్యాంక్ నెదర్లాండ్స్, టాప్ ర్యాంక్ బెల్జియంపైన విజయాలు సాధించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచింది.

Tags:    
Advertisement

Similar News