ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు
కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని వైఎస్ జగన్ ధ్వజం
ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు తాము చేసిన మేలు ఏమిటో వివరించారు. తమ హయాంలో రైతులు నష్టపోయకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూ. 21 వేల నుంచి రూ. 27 వేల దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలించాం. వైసీపీ పాలనలో రైతే రాజు. కానీ కూటమి ప్రభుత్వం రైతును దగా చేసిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వడం లేదు. రైతుకలు సున్నా వడ్ఈ రాని పరిస్థితి నెలకొన్నది. గతంలో కల్తీ విత్తనాలు అమ్మితే భయపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సర్కారే దగ్గర ఉండి కల్తీ విత్తనాలు అమ్మిస్తున్నది. ప్రైవేట్ డీలర్లు 500 ఎక్కువ ధరకు ఎరువులు అమ్ముతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అభించడం లేదు. మిర్చి రైతులను ఇబ్బందులను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మిర్చి పంటకు రూ. 11 వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తున్నది. ఎరువులను బ్లాక్‌లో కొనాల్సిన దుస్థితి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.