శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు
Advertisement
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయ ఈవో, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు అదనపు క్యూలైన్ల నిర్మాణం, తాత్కాలిక వసతి, పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆలయ పరిధిలో స్వాగత తోరణాలను ఏర్పాటు చేయడంతో కొత్త కళను సంతరించుకున్నది. బుధవారం రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు.
Advertisement