ధోనీకి కాంట్రాక్టులేకపోడం పై బీసీసీఐ వివరణ

జట్టులో చోటుకు కాంట్రాక్టుతో పనిలేదన్న బీసీసీఐ భారత ఎవర్ గ్రీన్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి..2019-2020 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కకపోడం గురించి బీసీసీఐ వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఆరుమాసాలపాటు క్రికెట్ కు దూరమైన క్రికెటర్లకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో చోటు ఉండదని…ఆ కారణంగానే ధోనీకి గ్రేడింగ్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. కాంట్రాక్టు లేని కారణంగా టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో ధోనీ చోటుకు ఎలాంటి ఇబ్బందీలేదని వివరణ ఇచ్చింది. 2020 ఐపీఎల్ సీజన్లో.. ధోనీస్థాయికి తగ్గట్టుగా […]

Advertisement
Update:2020-01-17 06:52 IST
  • జట్టులో చోటుకు కాంట్రాక్టుతో పనిలేదన్న బీసీసీఐ

భారత ఎవర్ గ్రీన్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి..2019-2020 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కకపోడం గురించి బీసీసీఐ వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఆరుమాసాలపాటు క్రికెట్ కు దూరమైన క్రికెటర్లకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో చోటు ఉండదని…ఆ కారణంగానే ధోనీకి గ్రేడింగ్ ఇవ్వలేదని స్పష్టం చేసింది.

కాంట్రాక్టు లేని కారణంగా టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో ధోనీ చోటుకు ఎలాంటి ఇబ్బందీలేదని వివరణ ఇచ్చింది. 2020 ఐపీఎల్ సీజన్లో.. ధోనీస్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితే…ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే 2020 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనటానికి ఏమాత్రం అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది.

గత సీజన్ వరకూ ఏడాదికి 5 కోట్ల రూపాయల గ్రేడ్- ఏ కాంట్రాక్ట్ క్రికెటర్ గా ఉన్న ధోనీ కెరియర్ లో సెంట్రల్ కాంట్రాక్టు విధానం ప్రవేశపెట్టిన తర్వాత.. గ్రేడింగ్ లేకపోడం ఇదే మొదటిసారి.

2014లో తన చిట్టచివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన మహేంద్రసింగ్ ధోనీ ఆ తర్వాత సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతేకాదు..ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత ధోనీ క్రికెట్ కు తనకుతానుగా దూరమయ్యాడు.

గత ఆరుమాసాలుగా క్రికెట్ నుంచి వ్యూహాత్మక విరామం తీసుకొన్న కారణంగానే ధోనీ 5 కోట్ల రూపాయల గ్రేడ్- ఏ కాంట్రాక్టును కోల్పోవాల్సి వచ్చింది. 2005 తర్వాత బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు లేకపోడం ధోనీకి ఇదే మొదటిసారి.

2019 ఫిబ్రవరిలో తన చివరి టీ-20 మ్యాచ్, 2019 జులైలో చిట్టచివరి వన్డే మ్యాచ్ ఆడిన ధోనీ భవితవ్యం ఐపీఎల్ 2020 సీజన్లో రాణించడం పైనే ఆధారపడి ఉంది.

Tags:    
Advertisement

Similar News