ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు ఒకరు మృతి..తండ్రీకూతురు గల్లంతు
అదుపుతప్పి ఓ కారుఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది దీంతో బాలుడు మృతిచెందగా, తండ్రీకూతురు గల్లంతు అయ్యారు.;
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఓ కారు ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో బాలుడు మృతిచెందగా, తండ్రీకూతురు గల్లంతు అయ్యారు. భార్యను స్థానికులకు కాపాడారు. ప్రస్తుతం గజఈతగాళ్లతో తండ్రీకూతురి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పాట్‌కు వెళ్లిన పోలీసులు సహాయక ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుటుంబంతో సహా కారులో ప్రయాణిస్తుండగా, సంగెం మండలం తీగరాజుపల్లి మార్గమధ్యలో డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్‌కు గుండె నొప్పి వచ్చింది. దీంతో చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలో పడింది.