ముంబై వన్డేలో భారత్ కు ఆస్ట్ర్రేలియా షాక్

వాంఖెడీలో తేలిపోయిన విరాట్ సేన వార్నర్- ఫించ్ సెంచరీలతో 10 వికెట్ల గెలుపు విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు వరుస విజయాలు బలుపుకాదు…వాపని తేలిపోయింది. కొత్తసంవత్సరం తొలిమ్యాచ్ లోనే వన్డే క్రికెట్ రెండోర్యాంకర్ భారత్ కు మింగుడుపడని ఫలితం ఎదురయ్యింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన తొలివన్డేలో 4వ ర్యాంక్ ఆస్ట్ర్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది. దిగ్గజాల సమరంలా సాగుతుందనుకొన్న ఈ […]

Advertisement
Update:2020-01-15 02:49 IST
  • వాంఖెడీలో తేలిపోయిన విరాట్ సేన
  • వార్నర్- ఫించ్ సెంచరీలతో 10 వికెట్ల గెలుపు

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు వరుస విజయాలు బలుపుకాదు…వాపని తేలిపోయింది. కొత్తసంవత్సరం తొలిమ్యాచ్ లోనే వన్డే క్రికెట్ రెండోర్యాంకర్ భారత్ కు మింగుడుపడని ఫలితం ఎదురయ్యింది.

మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన తొలివన్డేలో 4వ ర్యాంక్ ఆస్ట్ర్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేసి 1-0 ఆధిక్యం సంపాదించింది.

దిగ్గజాల సమరంలా సాగుతుందనుకొన్న ఈ పోరు కాస్త ఏకపక్షంగా ముగిసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత ఓపెనర్లలో రోహిత్ శర్మ 10 పరుగులు, శిఖర్ ధావన్ 74 పరుగులు, రాహుల్ 17, కెప్టెన్ కొహ్లీ 16 పరుగులకు అవుటయ్యారు. ఆ తర్వాత మిడిలార్డర్ కుప్పకూలడంతో భారత్ 255 పరుగుల స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది.

కమిన్స్, స్టార్క్, రిచర్డ్స్ సన్, స్పిన్ జోడీ అగర్, జంపా చక్కటి లైన్ అండ్ లెంగ్త్ తో బౌల్ చేసి కీలక సమయాలలో వికెట్లు తీయడం ద్వారా భారత్ కు పగ్గాలు వేయగలిగారు.

స్టార్క్ 3వికెట్లు, కమిన్స్, రిచర్డ్స్ సన్ చెరో రెండు వికెట్లు, అగర్, జంపా చెరో వికెట్ పడగొట్టారు.

వార్నర్- ఫించ్ అజేయ సెంచరీలు…

50 ఓవర్లలో 256 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఆస్ట్ర్రేలియాకు ఓపెనింగ్ జోడీ వార్నర్- ఫించ్ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో కేవలం 37.1ఓవర్లలోనే 10 వికెట్ల విజయం అందించారు.

వార్నర్ 112 బాల్స్ లో 17 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 128, ఫించ్ 114 బాల్స్ లో 13 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 110 స్కోర్లు సాధించి అజేయంగా నిలిచారు.

మొదటి వికెట్ కు 258 పరుగుల అజేయ భాగస్వామ్యంతో తమజట్టును విజేతగా నిలిపారు.

భారతజట్టులోని ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆస్ట్ర్రేలియా భారీవిజయంలో ప్రధానపాత్ర వహించిన డేవిడ్ వార్నర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సిరీస్ లోని రెండోవన్డే జనవరి 17న రాజ్ కోట వేదికగా ప్రారంభంకానుంది.

Tags:    
Advertisement

Similar News