అశ్విన్ ను అధిగమించిన యాండర్సన్
28వసారి జిమ్మీ యాండర్సన్ 5 వికెట్ల రికార్డు ఇంగ్లండ్ ఎవర్ గ్రీన్ స్వింగ్ బౌలర్ జిమ్మీ యాండర్సన్ తన రికార్డులను తానే అధిగమించుకొంటూ దూసుకుపోతున్నాడు. కేప్ టౌన్ లోని న్యూల్యాండ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండోటెస్టుమూడోరోజు ఆటలో యాండర్సన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన కెరియర్ లో 28వసారి 5 వికెట్ల ఫీట్ సాధించాడు. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సాధించిన 27సార్లు 5 వికెట్ల రికార్డును జిమ్మీ యాండర్సన్ అధిగమించాడు. ఇంగ్లండ్ టెస్టు చరిత్రలో ఐదు […]
- 28వసారి జిమ్మీ యాండర్సన్ 5 వికెట్ల రికార్డు
ఇంగ్లండ్ ఎవర్ గ్రీన్ స్వింగ్ బౌలర్ జిమ్మీ యాండర్సన్ తన రికార్డులను తానే అధిగమించుకొంటూ దూసుకుపోతున్నాడు. కేప్ టౌన్ లోని న్యూల్యాండ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండోటెస్టుమూడోరోజు ఆటలో యాండర్సన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన కెరియర్ లో 28వసారి 5 వికెట్ల ఫీట్ సాధించాడు.
భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సాధించిన 27సార్లు 5 వికెట్ల రికార్డును జిమ్మీ యాండర్సన్ అధిగమించాడు.
ఇంగ్లండ్ టెస్టు చరిత్రలో ఐదు వికెట్లు 27సార్లు పడగొట్టిన రికార్డు మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ పేరుతో ఉంది.
ఆ రికార్డును యాండర్సన్ తెరమరుగు చేసి..అత్యధికసార్లు టెస్టు క్రికెట్లో 5 వికెట్లు పడగొట్టిన బ్రిటీష్ బౌలర్ గా రికార్డుల్లో చేరాడు. డూప్లెసిస్, ప్రిటోరిస్, కేశవ్ మహారాజ్, రబాడా, నోర్జేలవికెట్లు పడగొట్టడం ద్వారా.. యాండర్సన్ 5 వికెట్ల రికార్డును పూర్తి చేయగలిగాడు. క్రికెట్ చరిత్రలో అత్యధిక 5 వికెట్లు సాధించిన బౌలర్ల వరుసలో యాండర్సన్ 8వ స్థానం సాధించాడు.
మురళీధరన్ టాప్…
క్రికెట్ చరిత్రలో శ్రీలంక స్పిన్ గ్రేట్ ముత్తయ్య మురళీధరన్ తన కెరియర్ లో ఆడిన 133 టెస్టుల్లో 67సార్లు 5కు పైగా వికెట్లు పడగొట్టడం ద్వారా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.
భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 35సార్లు 5 వికెట్ల రికార్డు సాధించడం ద్వారా మురళీ ధరన్ తర్వాతి స్థానంలో నిలిచాడు.
ఓ బ్యాట్స్ మన్ సెంచరీ సాధించడం ఎంతగొప్పో…ఓ బౌలర్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు సాధించడాన్ని అంతే గొప్పగా పరిగణిస్తారు.
బెన్ స్టోక్స్ క్యాచ్ ల రికార్డు…
ఓటెస్టు మ్యాచ్ లో అత్యధికంగా ఐదు క్యాచ్ ల పట్టిన రికార్డును ఇంగ్లండ్ ఫీల్డర్ బెన్ స్టోక్స్ సొంతం చేసుకొన్నాడు. కేప్ టౌన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెకెండ్ స్లిప్ స్థానంలో ఫీల్డర్ గా ఉన్న స్టోక్స్ ఐదు క్యాచ్ లు అందుకోడం విశేషం.