ఈ తల్లి కోతి ఫొటో.... కన్నీటి పర్యంతం అయ్యేలా చేసింది...

అమ్మ ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుంది? రోడ్డు ప్రమాదం లో తల పగిలిపోయి రక్తం ఓడుతున్నా ఓ తల్లి తన పిల్లను అక్కున చేర్చుకుని పాలివ్వడం చూపరులను కన్నీటి పర్యంతం చేసింది. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్-హైదరాబాదు హై వే అడవి గుండా సాగుతుంది. కోతుల్లాంటి చిన్న చిన్న జంతువులు ఈ రహదారిపైకి వచ్చి ప్రయాణీకులు ఇచ్చే తినుబండారాలను తీసుకుని తింటూ ఉంటాయి. ఇది మామూలు సంగతే. అడవిలో తిండి దొరక్క ఆకలితో అలమటిస్తూ తినడానికి ఏమైనా […]

Advertisement
Update:2020-01-04 13:23 IST

అమ్మ ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుంది? రోడ్డు ప్రమాదం లో తల పగిలిపోయి రక్తం ఓడుతున్నా ఓ తల్లి తన పిల్లను అక్కున చేర్చుకుని పాలివ్వడం చూపరులను కన్నీటి పర్యంతం చేసింది.

సంగారెడ్డి జిల్లా నర్సాపూర్-హైదరాబాదు హై వే అడవి గుండా సాగుతుంది. కోతుల్లాంటి చిన్న చిన్న జంతువులు ఈ రహదారిపైకి వచ్చి ప్రయాణీకులు ఇచ్చే తినుబండారాలను తీసుకుని తింటూ ఉంటాయి. ఇది మామూలు సంగతే.

అడవిలో తిండి దొరక్క ఆకలితో అలమటిస్తూ తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని పిల్లను తీసుకుని ఈ హైవేపై ఓతల్లి కోతి రోడ్డుపై తిరుగుతూ ఉంది. ఆ సమయం లో అతి వేగంతో వచ్చిన ఓ వాహనం ఢీకొంది. దీంతో తల్లి కోతి ఒకవైపు, పిల్ల కోతి మరోవైపు పడిపోయాయి. తల్లి కోతికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. తల నుంచి రక్తం కారిపోతూ ఉంది. అయినా తన దెబ్బలను పట్టించుకోకుండా బిడ్డ ఎక్కడుందో కాసేపు వెతికింది. బిడ్డ తన కంటికి కనపడగానే ఆత్రంగా దాని దగ్గరకు పరుగుతీసింది. గుండెలకు హత్తుకుని పాలిచ్చింది.

అయితే బిడ్డకు మాత్రం దెబ్బలేమీ తగలక పోవడం సంతోషించాల్సిన సంగతి. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ తన బిడ్డకు పాలిస్తున్న తల్లి కోతిని చూసిన ప్రత్యక్ష సాక్షులకు కన్నీళ్లు ఆగలేదు. అక్కడ ఉన్నవారిలో ఒకరు ఈ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

Tags:    
Advertisement

Similar News