పాక్ జట్టులోని హిందూ క్రికెటర్ కు వేధింపులు

డానిష్ కనేరియా పట్ల వివక్ష మ్యాచ్ విన్నర్ కనేరియా అంటే చిన్నచూపు పాకిస్థాన్ క్రికెట్లో హిందు-ముస్లిం వివక్ష ఉందన్న విషయాన్ని ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్, క్రికెట్ వ్యాఖ్యాత షోయబ్ అక్తర్ ఎట్టకేలకు బయటపెట్టాడు. తాను పాక్ జాతీయజట్టుకు ఆడే సమయంలో డానిశ్ కనేరియా అనే ఓ హిందు క్రికెటర్ సైతం సభ్యుడిగా ఉండేవాడని..అతను ఇంగ్లండ్ పై పాక్ జట్టుకు తన బౌలింగ్ ప్రతిభతో ఒంటిచేత్తో విజయం అందించిన విషయాన్ని అక్తర్ గుర్తు చేసుకొన్నాడు. పాక్ జట్టుకు తురుపుముక్కలాంటి […]

Advertisement
Update:2019-12-27 06:07 IST
  • డానిష్ కనేరియా పట్ల వివక్ష
  • మ్యాచ్ విన్నర్ కనేరియా అంటే చిన్నచూపు

పాకిస్థాన్ క్రికెట్లో హిందు-ముస్లిం వివక్ష ఉందన్న విషయాన్ని ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్, క్రికెట్ వ్యాఖ్యాత షోయబ్ అక్తర్ ఎట్టకేలకు బయటపెట్టాడు. తాను పాక్ జాతీయజట్టుకు ఆడే సమయంలో డానిశ్ కనేరియా అనే ఓ హిందు క్రికెటర్ సైతం సభ్యుడిగా ఉండేవాడని..అతను ఇంగ్లండ్ పై పాక్ జట్టుకు తన బౌలింగ్ ప్రతిభతో ఒంటిచేత్తో విజయం అందించిన విషయాన్ని అక్తర్ గుర్తు చేసుకొన్నాడు.

పాక్ జట్టుకు తురుపుముక్కలాంటి లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియాను జట్టులోని కొందరు ఆటగాళ్లు చిన్నచూపు చూసేవారని, హిందువు అంటూ వివక్ష పాటించేవారని, చివరకు అతనితో కలసి భోజనం చేయటానికి సైతం ఇష్టపడేవారు కాదని చెప్పాడు. పాకిస్థాన్ ను విజేతగా నిలిపిన ఓ ఆటగాడిని హిందువు అంటూ అవమానించడం, చిన్నచూపు చూడటం, వివక్ష పాటించడం ఎంత వరకూ సబబని అక్తర ప్రశ్నించాడు.

పాక్ జట్టు రెండో హిందు కనేరియా…

మతరాజ్యం పాకిస్థాన్ లోని హిందూ మైనార్టీల సంతతికి చెందిన లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ డానిష్ కనేరియాకు…పాక్ జాతీయ జట్టులో చోటు సంపాదించిన రెండోహిందూ క్రికెటర్ గా పేరుంది.

కనేరియా మేనమామ అనీల్ దల్పాట్…. పాక్ జట్టు తరపున ఆడిన హిందూ సంతతి తొలి క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. తన మేనమామ స్ఫూర్తితో పాక్ క్రికెట్లో అడుగుపెట్టిన డానిష్ కనేరియాకు 61 టెస్టుల్లో 261 వికెట్లు పడగొట్టడంతో పాటు 34.79 సగటు సైతం ఉంది.

అంతేకాదు పాక్ వన్డే జట్టు తరపున 18 వన్డే మ్యాచ్ లు ఆడిన ఘనత కూడా కనేరియాకు సొంతం. కనేరియా తర్వాత మరో హిందు సంతతి క్రికెటర్ పాక్ జట్టులో చోటు సంపాదించలేకపోడం విశేషం.

వివక్ష నిజమే- కనేరియా

పాక్ జట్టు తరపున ఆడిన రోజుల్లో తన పట్ల నలుగురు క్రికెటర్లు వివక్ష చూపిన మాట నిజమేనని, ఆ విషయాన్ని బయటపెట్టే ధైర్యం తనకు ఇంతకాలం లేకుండా పోయిందని… అయితే … అక్తర్ భాయి స్వయంగా బయటపెట్టడంతో తాను వాస్తవాన్ని ఆమోదించక తప్పలేదని కనేరియా తెలిపాడు.

తనను హిందువు అంటూ హేళన చేస్తూ, చిన్నచూపు చూసిన ఆ నలుగురు క్రికెటర్లు కరాచీ, పెషావర్, పంజాబ్ ప్రాంతాలకు చెందినవారని… త్వరలోనే వారిపేర్లు బయటపెడతానని ప్రకటించాడు.

జట్టు సభ్యులందరూ కలసి అల్పాహారం లేదా భోజనం చేస్తున్న సమయంలో ఆ నలుగురూ తనను దూరం పెట్టేవారని, తమతో కలసి ఓ హిందువు ఎలా తినగలడంటూ అవమానించేవారని గుర్తు చేసుకొన్నాడు.

మాజీ కెప్టెన్లు ఇంజమాముల్ హక్, మహ్మద్ యూనిస్, యూనిస్ ఖాన్ తనను సొంత తమ్ముడిలా ఆదరించారని తెలిపాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతూ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న 36 ఏళ్ల డానిష్ కనేరియా ప్రస్తుతం కరాచీలో నివాసం ఉంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News