ఏపీకి 3 రాజధానులు... వెంకయ్య సంచలన వ్యాఖ్యలు

దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎట్టకేలకు తన మనసులోని మాట బయటపెట్టారు. ఏపీకి 3 రాజధానులు చేయడంపై అధికారికంగా ఇప్పటివరకు బీజేపీ నేతలు స్పందించలేదు. జీవీఎల్, పురంధేశ్వరి లాంటి వాళ్లు అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే అంటూ పైపైనే మద్దతు తెలిపారు. ఇక కేంద్రంలోని మోడీ-షాలు సహా కీలక నేతల ఎవరూ ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై నోరు మెదపలేదు. అయితే తాజాగా ఏపీలో పర్యటించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలో 3 రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు. […]

Advertisement
Update:2019-12-24 10:58 IST

దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎట్టకేలకు తన మనసులోని మాట బయటపెట్టారు. ఏపీకి 3 రాజధానులు చేయడంపై అధికారికంగా ఇప్పటివరకు బీజేపీ నేతలు స్పందించలేదు. జీవీఎల్, పురంధేశ్వరి లాంటి వాళ్లు అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే అంటూ పైపైనే మద్దతు తెలిపారు.

ఇక కేంద్రంలోని మోడీ-షాలు సహా కీలక నేతల ఎవరూ ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై నోరు మెదపలేదు.

అయితే తాజాగా ఏపీలో పర్యటించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలో 3 రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నీట్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన వెంకయ్యనాయుడు భారతదేశంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలని కోరారు.

ఈ సందర్భంగా ఏపీలో అన్ని ఒక చోట పెట్టడం మంచిది కాదని.. రాజధానిలోనే అన్నీ ఉంటే మిగతా ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మద్దతు ఇచ్చినట్టే కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News