క్రిస్మస్, న్యూయర్ పూట మందుబాబులకు ‘మెట్రో’ షాక్

న్యూ ఇయర్ వస్తోంది. మరో వారం రోజుల్లోనే పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ఊరు వాడ సిద్ధమవుతోంది. కొందరు హైదరాబాద్ చేరుకుంటున్నారు. అక్కడ పార్టీలు, పబ్బుల్లో తెగ తాగి ఊగి న్యూ ఇయర్ కు వెల్ కం చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఇక హైదరాబాద్ లో మందుబాబులకు తాజాగా షాకిస్తోంది తెలంగాణ సర్కారు. ఇప్పటికే పోలీసులు కఠిన నిబంధనలు రూపొందించారు. తాజాగా మెట్రో కూడా మందుబాబులకు షాకిచ్చింది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా […]

Advertisement
Update:2019-12-24 10:30 IST

న్యూ ఇయర్ వస్తోంది. మరో వారం రోజుల్లోనే పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ఊరు వాడ సిద్ధమవుతోంది.

కొందరు హైదరాబాద్ చేరుకుంటున్నారు. అక్కడ పార్టీలు, పబ్బుల్లో తెగ తాగి ఊగి న్యూ ఇయర్ కు వెల్ కం చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఇక హైదరాబాద్ లో మందుబాబులకు తాజాగా షాకిస్తోంది తెలంగాణ సర్కారు. ఇప్పటికే పోలీసులు కఠిన నిబంధనలు రూపొందించారు.

తాజాగా మెట్రో కూడా మందుబాబులకు షాకిచ్చింది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపవద్దని సూచిస్తుండడంతో అందరూ మందేసి ట్రాఫిక్ లేని మెట్రోను వాడేందుకు సిద్ధమయ్యారు.

అయితే తాజాగా బెంగళూరు మెట్రో అధికారులు కొత్త నిబంధన తీసుకొచ్చారు. మందు తాగి వెళ్లేవాళ్లకు మెట్రో రైళ్లలో ‘నో ఎంట్రీ ’ ఆదేశాలను జారీ చేశారు. మందు తాగి మెట్రోలో ప్రయాణించకుండా కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇక హైదరాబాద్ మెట్రోలోనూ ఇదే ప్రతిపాదన తేవడానికి మెట్రో నిర్వాహకులు, పోలీసులు యోచిస్తున్నారు. సో మందుబాబులు తాగి మెట్రోలో ప్రయాణిద్దామంటే ఇక కుదరదన్నమాట..!

Tags:    
Advertisement

Similar News