ఐపీఎల్- 2020లో ఖరీదైన ఆటగాళ్లు

కంగారూ స్టార్లకు జాక్ పాట్ 15 కోట్ల 50 లక్షల ధరతో కమిన్స్ టాప్ కోల్ కతా వేదికగా ముగిసిన 2020 ఐపీఎల్ వేలంలో ఆస్ట్ర్రేలియా స్టార్ క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టారు. ఒకరినిమించి ఒకరు రికార్డు ధర సాధించి వారేవ్వా అనిపించుకొన్నారు. వెస్టిండీస్, సౌతాఫ్రికా క్రికెటర్లు సైతం తమవంతు వాటాను సంపాదించుకోగలిగారు. 8 ఫ్రాంచైజీలు- 140 కోట్ల 30 లక్షలు ఐపీఎల్ 13వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు కలసి కేవలం 62 మంది […]

Advertisement
Update:2019-12-20 02:40 IST
  • కంగారూ స్టార్లకు జాక్ పాట్
  • 15 కోట్ల 50 లక్షల ధరతో కమిన్స్ టాప్

కోల్ కతా వేదికగా ముగిసిన 2020 ఐపీఎల్ వేలంలో ఆస్ట్ర్రేలియా స్టార్ క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టారు. ఒకరినిమించి ఒకరు రికార్డు ధర సాధించి వారేవ్వా అనిపించుకొన్నారు. వెస్టిండీస్, సౌతాఫ్రికా క్రికెటర్లు సైతం తమవంతు వాటాను సంపాదించుకోగలిగారు.

8 ఫ్రాంచైజీలు- 140 కోట్ల 30 లక్షలు

ఐపీఎల్ 13వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు కలసి కేవలం 62 మంది స్వదేశీ, విదేశీ ఆటగాళ్ల కోసమే 140 కోట్ల 30 లక్షల రూపాయలను ఖర్చు చేశాయి.

ఈ మొత్తంలో మూడోవంతు భాగాన్ని కంగారూ స్టార్ క్రికెటర్లు పాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్, గ్లెన్ మాక్స్ వెల్, క్రిస్ లిన్, నేథన్ కౌంటర్ నైల్ దక్కించుకో గలిగారు.

పాట్ కమిన్స్ కు జాక్ పాట్…

 

ఐపీఎల్- 2020 వేలంలో రికార్డు ధర సాధించిన ఆటగాడిగా ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ యాండర్సన్ కమిన్స్ నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బౌలర్ గా, మ్యాచ్ విన్నర్ గా నిలిచిన కమిన్స్ కోసం వివిధ ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడ్డాయి.

2 కోట్ల రూపాయల కనీస వేలం ధరతో ప్రారంభమైన పోరులో రేటును అనూహ్యంగా పెంచుకొంటూ పోయాయి. చివరకు కోల్ కతా ఫ్రాంచైజీ 15 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు కమిన్స్ ను సొంతం చేసుకోగలిగింది.

2017 ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సాధించిన 14 కోట్ల 50 లక్షల రికార్డు ధరను కోటి రూపాయల అదనపు మొత్తంతో కమిన్స్ తెరమరుగు చేయగలిగాడు.

గ్లెన్ మాక్స్ వెల్ కు 10 కోట్ల 75 లక్షలు

టీ-20 ఫార్మాట్లో చిత్రవిచిత్రమైన షాట్లతో ఎడాపెడా బాదుడు స్పెషలిస్ట్ గా పేరుపొందిన గ్లెన్ మాక్స్ వెల్ కు సైతం కళ్లు చెదిరే వేలం ధర దక్కింది.

గతంలో తాను నాయకత్వం వహించిన కింగ్స్ పంజాబ్ జట్టులోనే మాక్స్ వెల్ 10 కోట్ల 75 లశ్రల రూపాయల ధరకు చోటు సంపాదించగలిగాడు.

2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ నుంచి మొదలైన మాక్స్ వెల్ వేలం ధర.. 10 కో్ట్ల 75 లక్షల దగ్గర ముగిసింది.
భారత డాషింగ్ ఓపెనర్ రాహుల్ నాయకత్వంలో మాక్స్ వెల్ బరిలోకి దిగనున్నాడు.

సఫారీ ఆల్ రౌండర్ వారేవ్వా….

సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10 కోట్ల రూపాయల ధరకు ఖాయం చేసుకొంది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన మోరిస్ బంతితో పాటు బ్యాటుతోనూ మెరుపులు మెరిపించి సత్తా చాటుకొన్నాడు. తన ఆల్ రౌండ్ ప్రతిభను ప్రదర్శించాడు.

కోటీ 50 లక్షల రూపాయల కనీస వేలంధరతో ప్రారంభమైన మోరిస్ కోసం రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా పోటీపడింది. ఆ తర్వాత కింగ్స్ పంజాబ్, బెంగళూరు, ముంబై ఫ్రాంచైజీలు సైతం వేలం ధరనూ పెంచుతూ వచ్చాయి. చివరకు విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరు ఫ్రాంచైజీ గూటిలోకి క్రిస్ మోరిస్ చేరగలిగాడు. కోట్రెల్ కు 8 కోట్ల 50 లశ్రల శాల్యూట్..

ప్రత్యర్థి బ్యాట్స్ మన్ ను అవుట్ చేసి…పెవీలియన్ కు సాగనంపే సమయంలో శాల్యూట్ చేసే మేనరిజంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన కరీబియన్ లెప్టామ్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కోట్రెల్ రికార్ఢు స్థాయిలో 8 కోట్ల 50 లక్షల రూపాయల ధరను సాధించాడు. 50 లక్షల రూపాయల కనీస వేలం ధరతో ప్రారంభమైన కోట్రెల్ వేలం కొత్తపుంతలు తొక్కింది.

ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు …కోట్రెల్ ను సొంతం చేసుకోడానికి ఉత్సాహం చూపాయి. చివరకు 8 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు కింగ్స్ పంజాబ్ జట్టుకు సొంతమయ్యాడు.

2020 ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర సాధించిన వెస్టిండీస్ క్రికెటర్ గా షెల్డన్ కోట్రెల్ రికార్డు నెలకొల్పాడు.

కౌంటర్ నైల్ కు 8 కోట్ల ధర…

ఆస్ట్ర్రేలియా మరో ఫాస్ట్ బౌలర్ నేథన్ కౌంటర్ నైల్ సైతం 8 కోట్ల రూపాయల ధరను సొంతం చోసుకొన్నాడు.కోటి రూపాయల కనీస వేలం ధరతో మొదలైన కౌంటర్ నైల్ వేలాన్ని చివరకు 8 కోట్ల రూపాయల ధరతో ముంబై ఫ్రాంచైజీ ముగించగలిగింది.

కౌంటర్ నైల్ ను సొంతం చేసుకోడానికి చెన్నై ఫ్రాంచైజీ సైతం గట్టిగానే పోరాడింది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా పేరుపొందిన కౌంటర్ నైల్…డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా మారనున్నాడు.

హెట్ మేయర్ సూపర్ హిట్….

కరీబియన్ నయా హిట్టర్, చెన్నై వన్డే సెంచరీ హీరో షెమ్రాన్ హెట్ మేయర్ ను 7 కోట్ల 75 లక్షల రూపాయల ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకొంది.

అలవోకగా సిక్సర్లు బాదడంలో మేటిగా గుర్తింపు పొందిన హెట్ మేయర్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఆర్డర్ కు అదనపు బలం కానున్నాడు.

ఇంగ్లండ్ టీ-20 కెప్టెన్ వోయిన్ మోర్గాన్, ఓపెనర్ జేసన్ రాయల్, ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ సైతం వివిధ జట్లలో చోటు సంపాదించగలిగారు.

Tags:    
Advertisement

Similar News