జ‌గ‌న్ సెక్యూరిటీగా ఆక్టోప‌స్ టీమ్ !

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆక్టోపస్ టీమ్‌లోని ప్రత్యేక కమాండోలను సీఎం భద్రతకు కేటాయించారు. కౌంటర్‌ టెర్రరిజంలో ప్రత్యేక శిక్షణ కలిగిన ఈ బలగాలు సీఎం నివాసం వద్ద బుధవారం నుంచి విధులు చేపట్టాయి. సీఎం సెక్యూరిటీని ప్ర‌స్తుతం ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ISW) చూస్తోంది. అయితే ఇక నుంచి వీరితో పాటు ఆక్టోపస్‌ టీమ్‌ కూడా పనిచేస్తుంది. 30 మంది ఆక్టోపస్‌ సభ్యులు గల ఈ టీమ్ ఫిప్ట్‌ల వారీగా […]

Advertisement
Update:2019-12-19 02:32 IST

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆక్టోపస్ టీమ్‌లోని ప్రత్యేక కమాండోలను సీఎం భద్రతకు కేటాయించారు. కౌంటర్‌ టెర్రరిజంలో ప్రత్యేక శిక్షణ కలిగిన ఈ బలగాలు సీఎం నివాసం వద్ద బుధవారం నుంచి విధులు చేపట్టాయి.

సీఎం సెక్యూరిటీని ప్ర‌స్తుతం ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ISW) చూస్తోంది. అయితే ఇక నుంచి వీరితో పాటు ఆక్టోపస్‌ టీమ్‌ కూడా పనిచేస్తుంది. 30 మంది ఆక్టోపస్‌ సభ్యులు గల ఈ టీమ్ ఫిప్ట్‌ల వారీగా ప‌నిచేస్తుంది. ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడిన ఆక్టోపస్‌ టీమ్‌ నిర్ధేశించిన విధులు చేపడుతుంది. సీఎం వెంట ఉండటంతోపాటు ఆయన పర్యటనలు, సభలు, సమావేశాల సందర్భంలో ఆక్టోపస్‌ టీమ్‌లు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తాయి.

సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆయ‌న భ‌ద్ర‌త‌పై రివ్యూ చేసిన అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు ఆయ‌నకు భ‌ద్ర‌త పెంచాల‌ని చాలా సార్లు కోరినా అప్ప‌టి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు సీఎంగా ఆయ‌న‌కు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పోలీసుశాఖ‌తో పాటు నిఘా వ‌ర్గాలు నివేదిక ఇచ్చాయి. ఈ నివేదిక ఆధారంగా ఆయ‌న‌కు ఆక్టోప‌స్ టీమ్‌తో భ‌ద్ర‌త క‌ల్పించారు.

Tags:    
Advertisement

Similar News