యాదగిరిగుట్టలో మార్చి 1 నుంచి బ్రహోత్సవాలు
మార్చి 1 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ అధికారుల వెల్లడి
Advertisement
యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో మార్చి 1 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 7న ఎదుర్కోలు మహోత్సవం, 8న తిరు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 9న దివ్యవిమాన రథోత్సవం జరగనున్నది. బ్రహ్మోత్సవాల దృష్ట్యా కల్యాణాలు, హోమాలు, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చన సేవను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Advertisement