సొంత గ్రామస్తులపై బాలకృష్ణ ఆగ్రహం
బాలకృష్ణ సొంత గ్రామస్తులపై అసహనం వ్యక్తం చేశాడు
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంత గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ బాలయ్య తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్బంగా తన తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు గ్రామస్థులు ఆయనను కలిశారు. తమ గ్రామాన్ని ఓసారి రావాలని బాలయ్యను కోరారు. కోమరవోలా..అదెక్కడా. అయినా ఆ ఊరికి జన్మలో రాను ఆ ఊళ్లో ఉండే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకే పనులు లేవా అంటూ వారిపై ఆసహనం వ్యక్తం చేశారు మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని కొమరవోలు గ్రామస్తులు బాలకృష్ణను కోరారు.
అందుకు ఆయన ‘నేను పట్టించుకోను.. ఫొటోలు దిగారుగా వెళ్లండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరవోలు గ్రామమా? అదెక్కడ ఉంది? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లింగాయత్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో, తన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలును బాలకృష్ణ విస్మరించడం, అసహనం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.